
ఏపీలో ప్రతిపక్ష వైసిపికి బలమైన కంచుకోటలు లాంటి జిల్లాలలో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల వరకు నెల్లూరు జిల్లాలో వైసిపి తెలుగు లేకుండా ఉండేది. పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాలో 80 శాతం సీట్ల లో విజయం సాధించి తన పట్టు నిలుపుకుంది. అలాంటి జిల్లాలో గత ఎన్నికలలో మాత్రం నెల్లూరు ఎంపీ సీటు తో పాటు జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ సీట్లలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. బలమైన నాయకులు ఉండడంతో పార్టీకి సంస్థాగతంగా బలం ఉందని అందరూ ఇప్పటివరకు భావించారు. తాజాగా జగన్ నెల్లూరు జిల్లాకు వెళ్లాల్సి వచ్చింది. నెల్లూరు హెలీ ఫ్యాడ్ కు సరైన స్థలం దొరకక జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. అందుకే జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జగన్ పరామర్శించడంలో ఆలస్యం జరుగుతోంది. నెల్లూరులో హెలీప్యాడ్ విషయమై ప్రస్తుతం ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది.
అటు చిత్తూరు జిల్లాలో ఈ నెల 9న జగన్ గిట్టుబాటు ధర లేక ఇబ్బందుల్లో ఉన్న మామిడి రైతులను పరామర్శిస్తున్నారు. జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - భూమన కరుణాకర్ రెడ్డి అలాగే మాజీ మంత్రులు నారాయణస్వామి, ఆర్కే రోజా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కానీ నెల్లూరు జిల్లాలో వైసీపీకి బలమైన నాయకత్వం కొరత ఉందని తాజాగా జగన్ పర్యటన వాయిదా చెపుతోంది. నెల్లూరులో జగన్ హెలికాప్టర్ దిగేందుకు కూడా టిడిపి నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటే .. భవిష్యత్తులో తమకు ఫలానా నాయకులనుంచి ఇబ్బందులు ఎదురవుతాయన్న భయం వాళ్ళలో లేకపోవడమే కారణం అని చెప్పాలి. ఏది ఏమైనా కంచు కోట లాంటి జిల్లాలో జగన్‌కు ఇలాంటి పరిస్థితి రావటం ఇబ్బందికరమని చెప్పాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు