- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంకు టీడీపీ త‌ర‌పున‌ కొత్త స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త శంక‌ర్ రెడ్డి ని అధిష్టానం నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు ఈయనకు శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని అనుకున్నారు. అయితే బొజ్జ‌ల‌ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేపథ్యంలో కాదనలేక శ్రీకాళహస్తి టికెట్ను బొజ్జ‌ల‌ గోపాల కృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డికి ఇచ్చారు. అక్క‌డ ఆయ‌న ఎమ్మెల్యే గా విజ‌యం సాధించారు. తాజాగా సత్యవేడు టిడిపిలో పెద్ద గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో దానికి చెక్ పెట్టడానికి శంకర్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించడం చర్చి నీయాంశం అయింది. గత ఎన్నికలలో టిడిపికి శంకర్ రెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారు. లోకేష్ తో కూడా శంకర్ రెడ్డి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.


మరోవైపు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చి ఇక్కడ కూడా ఎమ్మెల్యే సీటు ద‌క్కించుకుని విజయం సాధించారు. ఆయన తీరు ఇటీవల వివాదం కావడంతో టిడిపి స్థానం సీరియస్ గా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సత్యవేడు బాధ్యతలని శంకర రెడ్డికి అప్పగించడం ద్వారా అక్కడ కీ రోల్ పోషించేది ఎవరో ? అధిష్టానం సంకే తాలు ఇచ్చినట్లు అయింది. కొద్ది రోజుల క్రితం లోకేష్ సత్య‌వేడు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు త్వరలోనే ఇక్కడ సమస్యకు పరిష్కారం చూపుతామని పార్టీ కేడ‌ర్‌ కు హామీ ఇచ్చారు. తాజాగా శంకర్ రెడ్డి తో చర్చించి ఆయనకు సత్య‌వేడు సమన్వయకర్త పగ్గాలు అప్పగించారు. మరి ఆయన నియామకంతో ఆయన సత్య‌వేడు టిడిపి గాడిన పడుతుందా ? లేదా అన్నది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: