ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో  టిడిపి కాంగ్రెస్ మాత్రమే బాహాబాహీ ఉండేవి..రాజశేఖర్ రెడ్డి మరణం, తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పూర్తిగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయి ఆ స్థానంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ పార్టీకి అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉంటూ వచ్చారు. అంతేకాదు ఓసారి అధికారంలో కూడా కూర్చున్నారు.. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం జగన్ దారుణంగా ఓటమిపాలై సైలెంట్ గా ఉన్నారు. ఇదే తరుణంలో జగన్ సొంత చెల్లెలు అయినటువంటి షర్మిల  తన అన్న ఓటమికి ప్రధాన కారకురాలు  అయింది. అంతేకాదు ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతోంది. కానీ ఆమె తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా మాట్లాడతారో అదే మాట్లాడుతుంది తప్ప తాను కాంగ్రెస్ నాయకురాలు అనే విషయాన్ని మరిచిపోయినట్టుంది. ఇదే తరుణంలో  ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జిగా మణికంఠాగూర్ ఉన్నారు.. ఆయన ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి ఉండేవారు. 

ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మార్చారు. ఈయన కూడా పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకుడిలాగే మాట్లాడుతూ జగన్ ను టార్గెట్ చేస్తున్నాడు. కట్ చేస్తే ఈ మధ్యకాలంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో కాస్త మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. జగన్ పై ఒత్తిడి చేస్తూ ఇలా మాట్లాడుతున్నారట. 2014 నుంచి బిజెపికి మద్దతు ఇస్తూనే వస్తున్నావు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇవ్వడం నుంచి మొదలు మొన్నటి వరకు వక్ఫ్ సవరణ బిల్లు వరకు జగన్ బిజెపికి సపోర్టుగా ఉంటూ వచ్చారు. కానీ బిజెపి మాత్రం నిన్ను వాడుకొని వదిలేసి, ఈ ఎన్నికల్లో చాలా మోసం చేసిందని ప్రశ్నిస్తున్నారు. అసలు బిజెపిని నమ్మడం కంటే కాంగ్రెస్ ను నమ్మడం మేలని వారు చెప్పుకొస్తున్నారట. మనం కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చాం మన మూలాలు కూడా కాంగ్రెస్ వే అంటూ అంటున్నారట. కాబట్టి జగను డైరెక్ట్ గానే కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారట. కానీ జగన్ మాత్రం తన చెల్లి షర్మిల అక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.

 షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా ఉన్నా కానీ  తెలుగుదేశం పార్టీని ఏమాత్రం విమర్శించకుండా కేవలం జగన్ ను మాత్రమే విమర్శల పాలు చేస్తుంది.. ఇదే తరుణంలో జగన్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే షర్మిల కాస్త మైనస్ అవుతుందని కార్యకర్తలు భావిస్తున్నట్టున్నారు. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాల్లో భాగంగా జగన్ హర్యానా ఎలక్షన్ కు సంబంధించి ఈవీఎంల టాపరింగ్ గురించి కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. అలాగే తమిళనాడు విషయం గురించి కాంగ్రెస్ కూటమికే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇలా బిజెపికి కాస్త వ్యతిరేకంగా మాట్లాడుతూ షర్మిలకి చెక్ పెట్టారా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. మరి చూడాలి జగన్ ను కాంగ్రెస్  కూటమిలో చేర్చుకుని షర్మిలాకు చెక్ పెడతారా లేదంటే జగన్ కే చెక్ పెట్టి  కూటమిలో చేర్చుకోకుండా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: