
అసలు విషయంలోకి వెళ్తే రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కొలికపూడి శ్రీనివాసరావు ఏదో మాట్లాడుతున్నట్లుగా ఒక వీడియో సంచలనంగా మారింది. అలా ఎయిర్ పోర్ట్ లో కొద్దిసేపు మంతనాలు జరిపినట్లుగా కనిపిస్తోంది. వీటికి తోడు గత కొద్ది రోజులుగా టీడీపీలో ఏదో ఒక విషయంపై వివాదాస్పదంగా మారుతున్నారు కొలికపూడి. ఈ క్రమంలోనే పెద్దారెడ్డి తో కలిసి కనిపించడంతో ఏపీ అంతట ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పెద్దారెడ్డి తనయుడు వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిను ఇటీవలే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తన కుమారుడని కలవడం కోసం వెళ్లగా ఆయనకు కొలికపూడి శ్రీనివాసరావు కనిపించి మాట్లాడినట్లు వినిపిస్తున్నాయి.
అయితే రాజకీయాలలో వినిపిస్తున్న సమాచారం మేరకు తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వ్యతిరేకంగానే కొలికపూడి వ్యవహరిస్తున్నారనే విధంగా టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.. మరి ఈ విషయం పైన కొలికపూడి ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.