శ్రీనగర్లో తాజాగా భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఎన్కౌంటర్లో పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను కూడా అంతం చేసినట్లుగా వినిపిస్తున్నాయి. ఆసిఫ్ ఫౌజి, అబు తల్హా, సులేమాన్ షా ను అంతం చేసినట్లుగా తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని మరి రక్షణ బలగాలు ఆపరేషన్ మహాదేవ్ నిర్వహించడం జరిగింది. దీనిని హిర్వాన్ - లిద్వాన్ ప్రాంతాలలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతం చేసినట్లుగా తెలుస్తోంది.



ఈ ఉగ్రవాదుల పై.. ఒక్కో ఉగ్రవాదిపై సుమారుగా 20 లక్షల రూపాయల వరకు రివార్డు కలిగి ఉన్నది. లోక్సభలో ఆపరేషన్ సింధూరపైన జరిగేటువంటి చర్చకు ముందే ఈ నిందితులను హతమార్చినట్లుగా వినిపిస్తోంది. మూడు నెలల క్రితం జరిగినటువంటి ఈ పహల్గామ్ దాడిలో 26 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణం వెనుక ఈ ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నట్లుగా భారతీయ దళాలు గుర్తించి వీరిని మట్టు పెట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.


శ్రీనగర్ లోని లిద్వాజ్ జనరల్ ఏరియాలో మహాదేవ సమీపంలో ఈ ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లుగా అక్కడ రక్షణ అధికారులకు సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలతో ఆపరేషన్ మహదేవ్ ను చేపట్టారు. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని సైతం రక్షణ దళాలు మోహరించి (ఇండియన్ ఆర్మీ, అక్కడ పోలీస్ అధికారులు ,సిఆర్పిఎఫ్ బలగాలు) కలిసి  ఉండడంతో ఉగ్రవాదులు సైతం వీరి పైన కాల్పులు చేయడానికి తెగబడ్డారు. ఆ వెంటనే భద్రత దళాలు అలర్ట్ అయ్యి ఈ ఉగ్రవాదుల పైన విరుచుకుపడినట్లుగా వినిపిస్తోంది. అయితే ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చినట్లుగా సమాచారం. గడిచిన రెండు రోజుల క్రితం దచీగామ్ అడవులలో కొందరు అనుమానాస్పదమైన వ్యక్తులు సంచారించినట్లుగా ఆర్మీ అధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం కోసం అడవులలో నివసించే జాతుల వారిచేత కన్ఫామ్ చేసుకొని మహదేవ్ ఆపరేషన్ ని పూర్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: