జనసేన అధినేత , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా పార్టీ పటిష్టత మీద ఫోకస్ పెడతారంట ! ఇప్పటివరకు సినిమాల కమెట్మెంట్ల తో బిజీగా ఉన్న పవన్ .. మరో రెండు సినిమాల తర్వాత రాజకీయాలకే ఫుల్ టైమ్ కేటాయించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “ఇదే మంచి ముహూర్తం” అని భావించిన పవన్ .. ప్రస్తుతం నడుస్తున్న శ్రావణ మాసంలోనే కీలక నిర్ణయాలు తీసుకోవాలని మూడ్‌లో ఉన్నారట! పార్టీలో జరిగిన కార్యకలాపాలు , ఎమ్మెల్యేల పనితీరు వంటి అంశాల పై పవన్ సమీక్షకు సిద్ధమయ్యారట. సర్వేల్లో వెనకబడినవారికి క్లాస్ తీసుకునే అవకాశం ఉండనుంది.
 

పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో విస్తరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ .. ఇక నుంచి పనితీరు లేని ఎమ్మెల్యేలకు టిక్కెట్లే కట్ చేస్తారని సమాచారం ! అంతేకాదు .. ఇప్పటివరకు పార్టీకి నిజంగా సేవ చేసిన విధేయులకి గుర్తింపు ఇవ్వాలని పవన్ డిసైడ్ అయ్యారట . పదవులు , నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తమదైన దారిలో అడుగులు వేయాలని ఫిక్స్ అయిపోయారట . “పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం ఇచ్చి .. నమ్మకాన్ని మరింత పెంచాలి” అన్నదే పవన్ స్ట్రాటజీ . జనసేనలో ఒకప్పుడు 2014లో కనిపించిన ఆ జోష్ .. ఇప్పుడూ అవసరం అని పవన్ స్పష్టంగా భావిస్తున్నారట. అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అయిన నేతలకు ఇప్పుడు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.


“పదవి ఉంది కాబట్టే పని చేస్తానన్న ధోరణి మానాలి.. పార్టీ కోసం నిజంగా పని చేయాలంటే ఇప్పుడు టైం వచ్చేసింది” అనే సందేశాన్ని ఆయన అందరికీ క్లియర్‌గా చెప్పబోతున్నారట. అన్ని కలిపి చూస్తే.. పవన్ ఇక రాజకీయాల్లోని ‘ఫుల్ టైమ్’ మోడ్‌లోకి వెళ్లిపోయినట్టే! ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ చేతిలో ఉన్న ప్రోగ్రెస్ రిపోర్టులు హాట్ టాపిక్‌గా మారాయి. ఎవరు బాగున్నారు? ఎవరు వెనకబడ్డారు? ఎవరి టికెట్‌కు రెడ్ లైట్ పడబోతోంది? అన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి.. పవన్ కళ్యాణ్ పార్టీలో కొత్త జోష్‌కి, పనితీరు ఆధారిత రాజకీయాలకి నాంది పలకబోతున్నారు. ఈసారి ఆట మామూలుగా ఉండదనేది పార్టీ వర్గాల మాట!

మరింత సమాచారం తెలుసుకోండి: