ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసు ఎంత సంచలనంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ కేసులో ఇప్పటికే చాలామంది వైసిపి నేతలను అరెస్టు చేశారు. తాజాగా ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా రూ .11 కోట్లు సీజ్ చేసి చేయగా.. అందుకు సంబంధించిన వివరాలను ఈడి అధికారులు కోరినట్లుగా సమాచారం. నిన్నటి రోజున శంషాబాద్ కాచారంలో సిట్ అధికారులు ఈ డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలను ఇవ్వాలంటూ ఈడీ కోరింది.



అయితే ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డు చేశారు. అలాగే చంద్రారెడ్డి సైతం విచారించారు.. తాజాగా రూ .11 కోట్ల రూపాయలు సిజ్ చేసిన వ్యవహారంలో మరి కొంతమంది నేతలకు ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇలా లిక్కర్ స్కామ్ లో ఒకవైపు సిట్ అధికారులు, మరొకవైపు ఈడీ అధికారులు విచారణను వేగవంతంగా చేస్తున్నారు. గత వైసిపి హయాంలో ఈ లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయని అలాగే అసలు పాత్రధారి జగనే అంటూ కొన్ని కథనాలు కూడా వినిపించాయి.


ఒకవేళ ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కనుక జగన్ పేరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనను అరెస్టు చేస్తారనే విధంగా కూటమినేతలు ప్రచారం చేస్తున్నారు.మరి ఈ కేసు ఇప్పుడు ఎలాంటి పరిణామాలను చోటు చేసుకుంటుందో చూడాలి. అయితే ఈ లిక్కర్ కేసులో వరుణ్ పేరు నమోదైన వెంటనే ఆ వ్యక్తిని దేశం దాటించారు.. దీంతో విజయవాడ కోర్టు నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్లు సమాచారం. వీటికి  తోడు ఇవాళ, రేపు మరికొన్ని ప్రాంతాలలో కూడా సిట్ అధికారులు సోదాలు చేసే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి.. లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డి తో సహా మరో 12 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: