
అయితే ఈ వివాదం విషయంలో లోకేష్ సైతం జోక్యం చేసుకోవడం గమనార్హం. నారా లోకేష్ బనకచర్ల గురించి ఘాటైన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఒకింత కరుకుగా నిలదీస్తూ ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్ సైతం బనకచర్ల కట్టడానికి వీలు లేదని చెబుతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ వాడుకోగా అన్ని పోగా మిగిలిన వాటర్ ను వాడుకుంటామని చెబితే ఇబ్బంది ఏంటని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగువన కడితే మేము ఏమైనా అభ్యంతరం చెప్పామా అని ప్రశ్నలు సంధించారు. ఆ సమయంలో దానికి మేము మద్దతు ఇచ్చామని లోకేష్ తెలిపారు. లోకేష్ చేసిన కామెంట్లలో సైతం నిజం ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
నారా లోకేష్ చాలా ముఖ్యమైన పాయింట్ గురించి మాట్లాడుతూ వచ్చారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ నేతలకు లోకేష్ సంధించిన ఈ కీలక ప్రశ్నలకు సంబంధించి అటువైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉంది. నారా లోకేష్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు