ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి రోజున పులివెందల, ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికలు సైతం జరిగాయి. ఈ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ఇందులో భాగంగా చాలామంది పోలీసులు కూడా భారీ బందోబస్తుతో అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగానే కొంతమంది నేతలను అరెస్టు చేశారు. అలా ఎట్టకేలకు పలు ఉద్రిక్తల మధ్య పోలింగ్ ముగిసినప్పటికీ కానీ రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది.


దీంతో ఆ రెండు చోట్ల రీపోలింగ్ జరుగుతుందని 3,14 కేంద్రాలలో రీపోలింగ్ కొనసాగుతోంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమై పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ రెండు పోలింగ్ కేంద్రాలలో సుమారుగా 1000 మంది ఓటర్లు ఉన్నారని ఎంపీ అవినాష్ రెడ్డి ఫిర్యాదుతో ఈసి రీపోలింగ్ కు  సైతం ఆదేశాలను జారీ చేసింది. అలాగే రేపటి రోజున పులివెందల ,ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు కూడా జరగనున్నాయి.


నిన్నటి రోజున పులివెందుల ,ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికలు జరిగగా పులివెందులలో 76.88 శాతం ఒంటిమిట్టలో 81.53 శాతం వరకు పోలింగ్ నమోదు అయినట్లుగా తెలుస్తోంది. రేపు కౌంటింగ్ జరగబోతూ ఉండడంతో ఎవరు గెలుస్తారనే విషయంపై ఏపీ ప్రజలు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు స్థానాలను అటు టిడిపి ,వైసిపి పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పులివెందులలో తమ పార్టీని నిలబెట్టుకోవాలని వైసిపి ప్రయత్నాలు చేస్తున్న వైసిపి కంచుకోటను బద్దలు కొట్టాలని టిడిపి పలు రకాలు ప్రణాళికలను రచించారు. మరి ఏ పార్టీల ప్రణాళికలు ఏ మేరకు ఫలిస్తాయనే విషయం రేపటి రోజున తెలియబోతోంది. అయితే ఇప్పటికే అటు రెండు ప్రాంతాలలో జరిగిన సంఘటనలకు సంబంధించి వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: