
టీడీపీ పెత్తనం – జనసేన అసంతృప్తి .. జనసేన గెలిచిన చోట్ల టీడీపీ నేతల ఆధిపత్యం ఎక్కువగా ఉందని, తాము ఉత్సవ విగ్రహాల్లా మారిపోయామని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు వాపోతున్నారు. సంక్షేమ పథకాల విషయంలో కూడా తమకు ప్రాధాన్యత లేకుండా, ఇతరులు ముందుకు వచ్చి క్రెడిట్ తీసుకుంటున్నారని అసంతృప్తి. నామినేటెడ్ పోస్టులు కూడా రాకపోవడంతో, పార్టీ లోపల వాతావరణం కాస్త టెన్షన్‌లో ఉంది. అవసరమైతే నేరుగా చర్చ .. ఈ ఫిర్యాదులను పవన్ సీరియస్‌గా తీసుకుని, అవసరమైతే టీడీపీ హైకమాండ్‌తో నేరుగా మాట్లాడి, జనసేన ఎమ్మెల్యేలకూ న్యాయం జరిగేలా చూడాలని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో తరచుగా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టి, చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా ప్లాన్ చేస్తున్నారు.
జనంలోకి పవన్ – 2029 మిషన్ మొదలు .. వచ్చే రోజుల్లో పవన్ నేరుగా నియోజకవర్గాల పర్యటనలు మొదలు పెట్టబోతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా, పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేసే పనిలో పడతారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వానికి అవకాశాలు ఇవ్వడం ద్వారా కేడర్ మోటివేషన్ పెంచే ప్రయత్నం ఉంటుంది. కూటమి గెలుపే లక్ష్యం .. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు. దానికి క్షేత్రస్థాయిలో ఐక్యత కీలకం. అందుకే వయా మీడియాగా తానే ముందుండి, పార్టీని, కూటమిని ఒకే దారిలో నడిపించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. పవన్ ఈ మోడ్‌లోకి వచ్చేసరికి, ఆంధ్ర రాజకీయాల్లో మరోసారి పవర్ స్టార్ హవా చూడబోతున్నామని రాజకీయ వర్గాల టాక్.