కొంత కాలం క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం , జనసేన , బి జె పి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీ చేశాయి. ఈ కూటమికి అద్భుతమైన రీతిలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. దానితో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా కొనసాగుతూ ఉంటే , పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం అనేక మంది మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా మంత్రులుగా పని చేస్తున్న కొంత మంది కి కొన్ని జిల్లాలలో ఇన్చార్జి మంత్రులుగా కూడా చంద్రబాబు నియమించాడు. అలా ఇన్చార్జ్ మంత్రులుగా నియమించిన వారు జెండా ఆవిష్కరణ చేస్తూ వస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక నేతలు అయినటువంటి నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ ఏ జిల్లాలకు కూడా ఇంచార్జ్ మంత్రులుగా పని చేయడం లేదు. ఇక ఈ సారి కేవలం ఇంచార్జ్ మంత్రులు మాత్రమే ఆ జిల్లాలలో జెండా ఆవిష్కరణ చేయడం కాకుండా ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేయాలి అనే చంద్రబాబు నాయుడు గారు సూచించారు.

దానితో గుంటూరు జిల్లా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలుపొంది ప్రస్తుతం మంత్రి గా కొనసాగుతున్న నేపథ్యంలో నారా లోకేష్ , గుంటూరు జిల్లాలో జెండా ఆవిష్కరణ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ , కాకినాడ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం ద్వారా గెలుపొందాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో జెండా ఆవిష్కరణ చేశాడు. ఇలా ఈ సారి నారా లోకేష్ , పవన్ కళ్యాణ్ తాము ఏ జిల్లాల నుండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి మంత్రులుగా పని చేస్తున్నారో ఆ జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: