ముంబైలో బడా స్టార్స్, వ్యాపారవేత్తలు అందరూ కూడా అపార్ట్మెంట్లోనే చాలామంది నివసిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో యూట్యూబ్ హోమ్ టూర్స్ అంటూ చేసినప్పుడు వారి యొక్క వసతులు చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఇలాంటి వారంతా కూడా ఎక్కువగా ఫ్లాట్స్ తీసుకుంటూ ఉంటారు. వీరి ఆస్తులన్నీ కూడా అపార్ట్మెంట్లోనే ఉంటాయి.. ఎంత పెద్ద డబ్బున్నవారైనా సరే సొంత బంగ్లాలో ఎందుకు నివసించారనే విషయం చాలామందికి అర్థం కాకపోవచ్చు. మరి వాటి గురించి చూద్దాం.



ముంబై విస్తీర్ణం కేవలం 603 చదరపు కిలోమీటర్లు ఉన్నప్పటికీ ఇందులోనే కొన్ని వందలాదిమంది అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్నారు. చాలా తక్కువ పరిమాణంలో ఇక్కడ భూములు ఉండడం చేత స్వతంత్ర ఇల్లు లేదా ఇల్లులు నిర్మించడం అనేది చాలా ఖరీదైనదట. అందుకే హై రేంజ్ అపార్ట్మెంట్లలో చాలామంది నివసిస్తూ ఉంటారు. సౌత్ ముంబై, జుహు, బాంద్రా, వర్లి ప్రైమ్ వంటి ప్రాంతాలలో భూముల ధరలు స్క్వేర్ ఫీట్లలోనే కొన్ని లక్షల రూపాయలతో ఉంటుంది. ముంబైలో ఉండే జనసాంద్రత చదరపు కిలోమీటర్ల విషయానికి వస్తే 21,000 మంది ఉంటారట. ఇది దేశంలోనే అత్యధికమైనట్లుగా తెలుస్తోంది.


జనాభా ఒత్తిడి వల్ల భూమి సమర్థవంతంగా ఉపయోగించడానికి ఇలా ఎన్నో అంతస్తుల భవనాలను నిర్మించాల్సి ఉంటుందట. ధనవంతులు అందరూ కూడా అపార్ట్మెంట్లో చాలా లగ్జరీ వాటినే చూసుకుంటున్నారు.. అందుకే ముంబైలో ఎక్కువగా 3BHK- 5BHK  వరకు ఉంటాయి. వీటి ధరలు రూ .5 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. లక్సరీ లైఫ్ కావాలనుకునే వారికి సరిగ్గా ఉపయోగపడుతుంది. ముంబై అనేది ఫాస్ట్  పేస్ట్ నగరం ఇక్కడ వ్యాపారస్తులు సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి వల్ల అక్కడ లగ్జరీ అపార్ట్మెంట్లు సామాజిక హోదాకి చిన్నగా మారిపోతున్నాయి. లగ్జరీ టవర్స్లలో నివసిస్తే ఒక స్టేటస్ సింబల్ గా మారుతుందని భావించి అందరూ కూడా అలాగే గడిపేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: