కేంద్రంలో ప్రస్తుతం బిజెపి సర్కార్ అధికారంలో ఉంది. దీనికి ప్రధాన కారణం నితీష్ కుమార్,చంద్రబాబు అని చెప్పవచ్చు. అలాంటి ఈ తరుణంలో బాబుని ఎలాగైనా కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోంది. దానికోసం అనేక ఎత్తుగడలు వేస్తోంది. కానీ కాంగ్రెస్ ట్రాప్ లో బాబు పడతారా.. ఆయన రాజకీయ అనుభవం ముందు  అసలు కాంగ్రెస్ నిలబడుతుందా అనేది తెలుసుకుందాం.. బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ అక్కడ ఓడిపోతే ఆయనకు బిజెపిపై శత్రుత్వం పెరుగుతుంది. దీంతో ఆయనను కాంగ్రెస్ కూటమిలో కలుపుకోవచ్చని భావిస్తున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును కూడా ఉపసంహరింప చేయొచ్చని అనుకుంటున్నారు. 

మరి దీనికోసం అక్కడ ముఖ్యమంత్రి పదవిని తేజస్వియాదవ్ త్యాగం చేసి నితీష్ కుమార్ కు ఇస్తారా  అంటే దానికి రెడీగా లేరు.. నితీష్ కుమార్ ని ఓడించి కాంగ్రెస్ తో కలుపుకుంటే మెల్లిగా చంద్రబాబును కూడా కాంగ్రెస్ దరి చేర్చుకోవచ్చని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఓవైపు రేవంత్ రెడ్డికి మరోవైపు రాహుల్ గాంధీకి చంద్రబాబు ఎప్పుడు టచ్ లోనే ఉంటారని అలకనంద అంటున్నారు. కానీ వారి ట్రాప్ లో చంద్రబాబు పడడం అంటే అంత ఈజీ విషయం కాదు. చంద్రబాబు రాజకీయం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఎప్పుడైనా ఒక్కరోజు కోసం రాజకీయం చేయరు భవిష్యత్తులో పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు.

 ఒకవేళ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆయన గ్రహిస్తే మాత్రం తప్పకుండా మోడీకి జలక్ ఇచ్చి కాంగ్రెస్ తో జత కడతారు. కానీ ఇంత స్పాట్ లో కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నట్టు ఆయన ఇండియా కూటమితో జతకట్టే అవకాశం అయితే కనిపించడం లేదు. ఒకవేళ వీరికి సపోర్ట్ చేసిన పీఎం కోసం ముగ్గురు నుంచి నలుగురు కొట్లాడే అవకాశం ఉంది. ఈ విధంగా బాబు తన రాజకీయ అవసరాల కోసం భవిష్యత్తులో జరిగే వాటిపై ముందుగానే అవగాహనకు వచ్చి ఏ పార్టీతో జతకడితే బాగుంటుందనేది తెలుసుకునే గొప్ప లీడర్ అని చెప్పవచ్చు. అలాంటి ఈయనను కాంగ్రెస్ ట్రాప్ చేయడం అంటే మామూలు విషయమైతే కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: