రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన చిత్రం ది రాజా సాబ్. అయితే ఇందులో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ మాత్రమే నటించారు. నిన్నటి రోజున రాత్రి నుంచి ప్రీమియర్ షోలు పడడంతో థియేటర్ల వద్ద అభిమానులు సైతం భారీ ఎత్తున హంగామా చేస్తున్నారు. సినిమా చూసిన ఫ్యాన్స్ సైతం ఇప్పటివరకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ ఫ్యాంటసి కాన్సెప్ట్ సినిమా చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్స్ ముగ్గురే కాకుండా ఇందులో మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటించినట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం



రాజా సాబ్ సినిమాలో  ప్రభాస్ నానమ్మ పాత్రలో నటించింది జరీనా వాహబ్. ఆమెకు ఇది సపోర్టింగ్ క్యారెక్టర్ అయిన ఆమె ఒకప్పుడు హీరోయిన్గా హిందీలో ఎన్నో చిత్రాలలో నటించింది. అలాగే మరొక నటి సుల్తానా కూడా ఇందులో నటించింది. హీరోయిన్ నిధి అగర్వాల్ స్నేహితురాలి పాత్రలో కన్నడ హీరోయిన్ మనీషా కందుకూర్ నటించారు. వీరితో పాటుగా ప్రభాస్ నానమ్మ పాత్రలో (గంగమ్మకు) యంగ్ వర్షన్ తమిళ హీరోయిన్ అమ్ము అభిరామి నటించారు. ఈమె తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది.


రాజాసాబ్ చిత్రంలో అతిథి పాత్రలో హీరోయిన్ ఆనంది కనిపించింది. ఇలా మొత్తం మీద చూసుకుంటే 8 మంది హీరోయిన్స్ నటించినట్లుగా నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత ప్రభాస్ అభిమానులు ప్రభాస్ ని ఇంత ఎనర్జిటిక్ గా చూడడంతో ఖుషి అవుతున్నారు. ప్రభాస్ ,నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయినట్లుగా కనిపిస్తోంది. మాళవికా మోహన్, రిద్ది కుమార్ కూడా తమ పాత్రలలో అద్భుతంగా నటించారు. అలాగే విలన్ గా సంజయ్ దత్ అద్భుతంగా ఆకట్టుకున్నారు. థమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరింత హైలైట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: