మన దేశంలో ఎక్కువగా వారసత్వ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి  నెహ్రూ నుంచి మొదలు రాహుల్ గాంధీ వరకు వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. అదే కాకుండా కొన్ని ప్రాంతీయ పార్టీలలో కూడా వారసత్వ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ బిజెపిలో మాత్రమే వారసత్వ రాజకీయాలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అలాంటి బిజెపి పార్టీ దేశంలోనే  అత్యుత్తమైనటువంటి పార్టీగా  ఎదుగుతుందని చెప్పవచ్చు. తాజాగా బిజెపి గురించి మరియు నెక్స్ట్  మూడు వారసులు ఎవరు అనేదానిపై గురించి సంచలన సర్వే బయటకు వచ్చింది. ముఖ్యంగా  ఈ సర్వే ప్రకారం.. రాహుల్ గాంధీ చాలా చివరి స్థానంలో ఉన్నారు. ఆ సర్వే ఏంటి వివరాలు చూద్దాం..

 ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. పోయినసారి 240  సీట్లు విడిగా వచ్చాయి.టోటల్గా కలిపితే  292 వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో బిజెపి సొంతంగా అధికారంలోకి వస్తుంది. రాబోవు రోజుల్లో ఎన్డీఏ 324 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇందులో బిజెపి 260 సింగిల్ గా గెల్చుకుంటుందని అంటున్నారు. ఇండియా కూటమి 208 కే సీట్ల పరిమితం అవుతుందని, కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన 99 సీట్లలో మరో రెండు సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు. అలాగే మోడీకి 52 శాతం ప్రజాధరణం ఉంటే, రాహుల్ గాంధీకి 25% ప్రజాదరణ ఉంది.

అలా చాలామంది ప్రజలు ప్రధానమంత్రిగా మోడీనే బాగుంటుందని అంటున్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే రాహుల్ గాంధీ కంటే అమిత్ షా ప్రధానమంత్రి అని నమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఆయనను 28 శాతం మంది ప్రజలు అభిమానిస్తున్నారు. ఇక మరో విషయం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ని రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మంది అభిమానిస్తున్నారు. 26 శాతం మంది యోగి ఆదిత్యనాథ్ ని నమ్ముతున్నారు. ఈ విధంగా మోడీ తర్వాత బిజెపి వారసులుగా అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లనే  ప్రజలు నమ్ముతారని ఈ సర్వే ద్వారా బయటపడింది

మరింత సమాచారం తెలుసుకోండి: