జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి 12 ఏళ్ళు అవుతోంది. కానీ మొదటిసారి పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు పార్టీ శ్రేణులతో పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్ళే దిశగా మూడు దశలలో మీటింగ్ ని పెట్టారు. మొదటిరోజు ముఖ్యమైన ప్రజాప్రతినిధులతో పాటుగా జిల్లాల వారీగా ముఖ్యమైన నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రెండవ రోజు కొంతమంది క్రియాశీలక కార్యకర్తలు, జిల్లాల వారీగా ఉన్న ప్రధాన కార్యకర్తలతో ఏర్పాటు చేశారు. మూడవరోజు పబ్లిక్ మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నారు.ఈ మీటింగ్ నిన్నటి రోజు నుంచే మొదలయ్యింది.


ఇలా మూడు దశలలో ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే.. ఈ మీటింగ్ కి చాలానే కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన పార్టీ నాయకులలో కూటమి నేతలలో అనుకున్నంతగా ఆశాజనకమైన పరిస్థితులు కనిపించలేదు. నియోజవర్గాలలో కొంతమంది నేతల మధ్య సఖ్యత లేదని.. తగినంత గౌరవం లభించకపోవడం , సరైన పదవులు దక్కలేదని అసహనంతో ఉన్నారు జనసేన నేతలు. కూటమిలో బయటికి చెప్పుకోలేనంత ఇబ్బందులు లేకపోయినా ఇంటర్నల్ గా సరిచేసుకోవాల్సిన పనులు చాలానే ఉన్నాయి.


2024 కి ముందు కూడా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నప్పటికీ కేడర్ మొత్తం పనిచేసింది. ఈ పొత్తు 15 ఏళ్లు కొనసాగుతుందని గెలిచిన తర్వాత చెబుతూ ఉన్నారు. అయితే ఈ విషయం పైన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని నాయకులకు చెప్పలేదు. కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ ఏం చెబితే అదే పాటిస్తూ ఉంటారు పార్టీ శ్రేణులు. ఉమ్మడి గోదావరి జిల్లా, కృష్ణ, గుంటూరు, ప్రకాశం వంటి మరికొన్ని జిల్లాలలో ఆశించిన స్థాయిలో జనసేన నాయకులకు ప్రాధాన్యత లభించలేదని. పనులు జరగలేదని, ఆర్థిక ప్రయోజనాలు కూడా కలగడం లేదని ఆశించిన స్థాయిలో పదవులు లేవని అసంతృప్తితో ఉన్నారు.


చాలామంది వైసిపి పార్టీలో టాప్ లీడర్ లాగా ఉన్న కొంతమంది  జనసేన పార్టీలోకి వెళ్లినప్పటికీ పార్టీలో ఎక్కడ కూడా తమ ఉనికి కనిపించలేదనే విధంగా చాలామంది నేతలు బాధపడుతున్నారు. ఇలాంటి వారందరినీ కలుపుకొని పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏ విధంగా ఉండాలి ,ఎన్ని  సీట్లు వచ్చే ఎన్నికలలో తీసుకోవాలి, ఏ ఏ  ప్రాంతాలలో న్యాయకత్వం ఇంకా పెరగాల్సి ఉందనే విషయంపై చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న 21 నియోజవర్గాల పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ నియోజకవర్గాల సీట్లు పెరిగితే నెంబర్ మరొక లాగా ఉంటుంది. నియోజవర్గాలు పెరగకపోయిన 40 సీట్లకు పైగా తీసుకునేలా ఈ మీటింగ్ లో చర్చించుకుంటున్నట్లు వినిపిస్తున్నాయి. ఇలా అన్ని విషయాల పైన కూడా ఈ మూడు రోజుల మీటింగ్లో  ఇంటర్నల్ గా వాళ్ళ అభిప్రాయాలు వంటివి తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి జనసేన పార్టీ నాలుగున్నరేళ్ల  లక్ష నిర్దేశం కోసం ఈ మీటింగ్ ఎంచుకున్నట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: