
ఐఏఎస్ సాధించడం అంటే అంత సులువైన విషయం కాదు. ఎంతో కష్టం, అంకితభావం ఉంటే తప్ప ఈ కలను నిజం చేసుకోలేం. ఇలాంటి కోవకే చెందిన వ్యక్తి ప్రియాంక గోయల్. వరుసగా ఐదు సార్లు విఫలమైనా, ఏ మాత్రం నిరుత్సాహపడకుండా, తన చివరి ప్రయత్నంలో విజయం సాధించి, నేటి యువతకు ఆమె ఆదర్శంగా నిలిచారు. పట్టుదల, ఓపిక ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక, చిన్ననాటి నుంచే చదువులో చురుగ్గా ఉండేవారు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత, యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. మొదటి ప్రయత్నంలోనే విఫలమయ్యారు. అయినా సరే, నిరాశ చెందకుండా మరింత కష్టపడి చదవడం మొదలుపెట్టారు. రెండోసారి, మూడోసారి... ఇలా ఐదు సార్లు విఫలమయ్యారు. ఒకానొక సమయంలో, ఆమె ఐఏఎస్ కలను వదిలేద్దామని అనుకున్నారు. కానీ, ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో, మళ్ళీ పుస్తకం పట్టారు.
ఇది తన చివరి అవకాశం అని భావించి, పూర్తి అంకితభావంతో ప్రిపేర్ అయ్యారు. ఈసారి, ఆమె విజయం సాధించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో 121వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ అధికారిగా తన కలను సాకారం చేసుకున్నారు. ప్రియాంక గోయల్ సక్సెస్ స్టోరీ చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఆమె తన అనుభవాలను, సలహాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అందుకే, ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 2.5 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. శ్రమ, పట్టుదల, మరియు ఓపిక ఉంటే విజయం తప్పకుండా వరిస్తుందని ఆమె తన జీవితం ద్వారా నిరూపించారు.
ఐఏఎస్ ప్రియాంక గోయల్ బ్యూటీ విత్ బ్రెయిన్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ప్రియాంక గోయల్ భవిష్యత్తులో మరిన్ని సంచలన విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.