
అమెరికాలో గోరుచిక్కుడుని గ్యార్ గమ్ లేదా క్లస్టర్ బీన్ అని పిలుస్తారు. ఈ గ్యార్ అనే పదం గోరుచిక్కుడు విత్తనాల నుంచి ఉత్పత్తి చేస్తారు. దీనిని పొడి రూపంలో మార్చడం వల్ల అమెరికాలో విపరీతమైన డిమాండ్ కలదు. దీనిని వివిధ రకాల పరిశ్రమలో లిక్విడ్ గా ఉపయోగిస్తారు (అంటే ఏదైనా చిక్కదనంగా కావలసిన పదార్థంలోకి). ఈ గ్యార్ గమ్ ను శిలాజ ఇంధనాలను వెలికి తీసే వాటిలలో ఉపయోగిస్తారు. భూమిలో ఉండే గ్యాస్ ముడి చమురును వెతికి తీసేందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనినే హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ పద్ధతి అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా గ్యార్ గమ్ మిశ్రమాన్ని రాళ్ల మధ్య పగుళ్లలోకి పంపించడం వల్ల సున్నితంగా చమురుని బయటికి వచ్చేందుకు సహాయపడుతుంది.
అలాగే పెట్రోలింగ్ పరిశ్రమలో పాటుగా, ఆహార ,ఔషధ, కాగితపు ఇతరత్రా వస్త్ర పరిశ్రమలలో కూడా వీటిని ఉపయోగిస్తారు. అలాగే ఫేస్ క్రీములలో కూడా గ్యార్ గమ్ ను ఉపయోగిస్తారు.గ్యార్ గమ్ అమెరికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, చైనా, ఆఫ్రికా వంటి ప్రాంతాలలో సాగు చేస్తున్నప్పటికీ .. వీటన్నిటి కంటే 80 శాతం వరకు భారత్ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. మనదేశంలో గ్యార్ ఎక్కువగా 72% రాజస్థాన్ నుంచి ఉత్పత్తి అవుతున్నది. వీటికి తోడు గుజరాత్ , మహారాష్ట్ర వంటి ప్రాంతాలే కాకుండా కర్ణాటక తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ ,పంజాబ్ ,ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలలో కూడా ఈ పంట భారీగా పండుతుంది.
ఈ గోరు చిక్కుడు పండడానికి కావలసినంత ఎండ పరిమితి వర్షం ఉండడం చాలా ముఖ్యము. అందుకు తగ్గ క్లైమేట్ కూడా ఇండియాలో ఉన్నది. అందువల్లే జూలై నుంచి ఆగస్టు మధ్యలో నాటి.. అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో కోత కోస్తారు. గ్యార్ గమ్ మనదేశంలో ఉత్పత్తివి 90 శాతం దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కొన్ని గణాంకాల లెక్కల ప్రకారం..2023- 24 ఇండియా నుంచి 4,17,674 మెట్రిక్ టన్నులు ఎగుమతి అవుతుంది. అంటే దీని విలువ సుమారుగా 600 మిలియన్ డాలర్లు పైగానే అవుతుంది.. అంటే మన కరెన్సీ ప్రకారం 4,500 నుంచి 5000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటిని అమెరికాకే కాకుండా జర్మనీ, రష్యా, నెదర్లాండ్ వంటి ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తోంది ఇండియా. ప్రస్తుతం భారత్ ,అమెరికా మధ్య అనిశ్చితి నెలకొంది.. దీని ప్రభావం గ్యార్ గమ్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.