
ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ అనుకూల మీడియా ఇతర పార్టీలలోని నేతలు చేసిన అక్రమాలను చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్న కొన్ని మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ వైసీపీ నేత చెవిరెడ్డి మీద ఒక స్టోరీ రాశారు. అదేమిటంటే 36 కోట్ల విలువైన భూమిని 2.93 కోట్లకే మద్యం సొమ్ముతో అర్చకుడి ఆస్తి కొట్టేశారు అంటూ రాసుకు వచ్చారు.. ఈ విషయంపై చెవిరెడ్డి కొడుకు హర్షిత్ రెడ్డి ఇప్పుడు వాటి మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.
గౌరవనీయులైన పత్రిక ప్రతినిధులకు సీఎంఆర్ ఇన్ఫ్రా సంస్థ ఎండి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అను నేను తెలియజేయడం ఏమిటంటే.. ఈనెల 13వ తేదీన అధికార పార్టీకి సంబంధించిన దినపత్రికలో మా నాన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలను ప్రచురించారు.. అలాగే తన పేరుని కూడా తీసుకురావడంతో మీరు రాసిన ఈ వార్తలు అనేక ఆవాస్తవాలు ప్రచారం చేసేలా ఉన్నాయి. నిజాలు తెలియపరచడానికె ఈ ప్రకటన విడుదల చేస్తున్నానంటూ తెలిపారు హర్షిత్ రెడ్డి.
పూజారి భూమిని చాలా చౌకగానే కొట్టేశారు సుమారుగా 36 కోట్లకు విలువైన భూమిని అంటూ 2.93 కోట్లకు చేజిక్కించుకున్నారని రాశారు.. మీరు అనుకుంటున్నట్లుగా ఆ భూమి విలువ అంతే అయితే అందులో కనీసం 10 శాతం (3.5 కోట్లు) ఇస్తే చాలు ఆ భూమిని మీకు ఇచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామంటూ తెలియజేశారు. భూమి కొనడానికి వెళ్ళినప్పుడు ఆ భూమి పరిస్థితి చూస్తే ఎవరు కూడా అంత డబ్బులు పెట్టడానికి ముందుకు రారని.. అక్కడ ఉన్న 2.93 ఎకరాల భూమిని మొత్తం విస్తీర్ణం మాస్టర్ ప్లాన్ బఫర్ జోన్ పరిధిలోకి వెళ్తుంది.. అందుకు సంబంధించి సర్వేనెంబర్ 462 ని పరిశీలిస్తే అర్థమవుతుందంటూ తెలిపారు.. అక్కడ ఒక సెంటు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడదు కేవలం చెట్లు పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.. ఆ భూమి డెవలప్మెంట్ చేయడానికి మాత్రమే రూ .2 కోట్లు ఖర్చు పెట్టామని.. ఆ భూమి యజమానితో ఒప్పందం చేసుకున్న ప్రకారమే ఆభూమి డెవలప్మెంట్ చేశామని తెలిపారు హర్షిత్ రెడ్డి. చట్టబద్ధంగానే డబ్బులు కూడా చెల్లించాము ఎక్కడ ఎవరిని కూడా మోసం చేయలేదని తెలిపారు.. అంత ఇన్కమ్ టాక్స్ అధికారులకు ఇచ్చిన నివేదికలో కూడా వెల్లడించామని తెలిపారు. బినామీ కంపెనీలు అంటున్నారు అవన్నీ కూడా చట్టబద్ధంగానే ఏర్పాటైన కంపెనీలు. ఆ కంపెనీల డైరెక్టర్లను చూసి సిట్ అధికారులు కూడా పారిపోయారని..ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారంటూ రాసుకు వచ్చారు అదంతా కూడా అబద్ధమే.. సిట్ అధికారులు పిలిచిన వెంటనే వారి కార్యాలయానికి వెళ్లి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాము అంటూ హర్షిత్ రెడ్డి. అక్కడ స్టేట్మెంట్ రాసిచ్చారంటూ తెలిపారు. ఇలాంటి అబద్ధాలు రాసేటప్పుడు కొంతైనా ఆలోచించాలి అంటూ ఇలాంటి అవాస్తవాలను పత్రికలలో పరిచరించవద్దంటూ తెలిపారు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి