
ఆంధ్ర రాష్ట్ర జనాభా 5 కోట్లు ఉండగా.. తాజాగా పత్రికా సర్కులేషన్ లెక్కలు చెబుతున్న ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పేపర్ సర్క్యులేషన్ 6,51,137 .. కలదు. సాక్షి పేపర్ విషయానికి వస్తే..6,12,814 , ఆంధ్రజ్యోతి పేపర్ విషయానికి వస్తే.. 2,35,315 మాత్రమే.. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపినా కూడా ఈనాడుకు 10 లక్షల రేంజ్ లో సర్కులేషన్.. సాక్షి కూడా దాదాపుగా అదే రేంజ్ లో ఉన్నది.. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలలో 4 నుంచి 5 లక్షల లోపు ఉంటుంది. ఏపీలో 5 కోట్ల మంది జనాభా తెలంగాణలో 3కోట్ల మంది జనాభా కలిపినా కూడా ఒక్కో న్యూస్ పేపర్ కు 10 లక్షల మంచి సర్క్యులేషన్ లేదని కనిపిస్తోంది. ప్రస్తుతం పత్రికలు కేవలం రిఫరెన్స్ కిందికి మాత్రమే పనికొస్తున్నాయి తప్పించి మరేం లేదు అన్నటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ న్యూస్ పేపర్లతో పోల్చుకుంటే టెక్నాలజీలో ఉపయోగించే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సర్కులేషన్ ఎక్కువగా ఉందని కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో న్యూస్ పేపర్ సర్కులేషన్స్ కూడా మరింత దారుణంగా పడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.