
ఈ విషయంపైన సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో భాగంగా.. వాట్సప్ గవర్నెన్స్ సేవలు అమలులోకి వచ్చిన తర్వాత తాసిల్దార్ కార్యాలయాలకు లబ్ధిదారులను ,దరఖాస్తు దారులను రప్పించవద్దంటూ ఆదేశాలను జారీ చేసిన కూడా రెవెన్యూ శాఖలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని.. ఇకమీదట ఇలాంటివి జరిగితే అసలు సహించని అంటూ తెలియజేశారు. వాట్సప్ గవర్నెన్స్ సేవల ద్వారానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను జారీ చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు.
అంతేకాకుండా పుట్టుకతో వచ్చిన కులం మధ్యలో మారదు కదా? అంటూ వెల్లడించారు. ఆదాయానికి ఇదేవిధంగా ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ పత్రాలను నేరుగా వాట్సప్ గవర్నెన్స్ సేవల ద్వారానే జారీ చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. అందుకు సంబంధించి మళ్ళీ ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి నెలరోజులపాటు ఆదాయ,కుల ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేయాలని తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉండే ప్రజల డేటాను తీసుకొని వారికి అవసరమైనప్పుడు ఈ ధ్రువీకరణ పత్రాలను డౌన్లోడ్ చేసుకుని సదుపాయాన్ని కూడా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కల్పించాలని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఒకవేళ వాట్సప్ గవర్నెన్స్ సేవల ద్వారా ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు అయితే అటు విద్యార్థులు, ప్రజలకు తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే కష్టాలకు చేక్ పడిపోతుంది.