నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాలు క్రితం బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న సినిమా కావడంతో అఖండ 2 మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక ఏమైందో ఏమో తెలియదు కానీ కొంత కాలం క్రితమే ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయడం లేదు అని మరో కొత్త విడుదల తేదీన త్వరలో ప్రకటిస్తాం అని ఈ మూవీ బృందం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనను విడుదల చేసి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఆఖండ 2 మూవీ యూనిట్ మాత్రం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేరినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అఖండ సినిమా కూడా డిసెంబర్ నెలలోనే విడుదల అయింది.

మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అఖండ 2 మూవీ ని కూడా డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానితో బోయపాటి శ్రీను "అఖండ" సినిమా హిట్ ఫార్ములాను అఖండ 2 విషయంలో కూడా ఫాలో కాబోతున్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా అఖండ 2 మూవీ పై ప్రస్తుతానికి మాత్రం అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: