ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు జట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి విషయాలలోనైనా కూటమి గానే కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక పేపర్ ప్రకటన కూటమిలో మరింత చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. గతంలో 2014, 19 లో పొత్తుతో ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ప్రచారం కేంద్రానికి ఇవ్వకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే వాడుకునేది. కానీ ఈసారి మాత్రం కాస్త గట్టిగానే భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత ఇస్తూ.. ఏపీలో కూటమిగా ప్రచారం చేసుకుంటున్నాయి.



2024 ఎన్నికలలో సీట్లు తక్కువగా ఇచ్చినా బిజెపి పార్టీ వెనకాడే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉండగా మరోవైపు జీఎస్టీ తగ్గింపు విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలలోకి మరింత లోతుగా తీసుకువెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం  కూటమిలో భాగంగా  ఒక అడ్వర్టైజ్మెంట్  ఇచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్లో కిరాణా సామాగ్రి 13% తగ్గిందని, గతంలో 18 /12/5% శాతం ఉన్నది ,అలాగే రోజువారి నిత్యవసర సరుకులు కూడా 13 % వరకు తగ్గిపోయిందని .. గతంలో 18/12% శాతం వరకు ఉండేది.. ఆరోగ్య భీమా విషయానికి వస్తే గతంలో 18 శాతం ఉండగా ఇప్పుడు  అసలు లేదు. అలాగే దుస్తులు, పాదరక్షలు, మందులు, స్టేషనరీ  వంటి వాటితో పాటుగా ట్రాక్టర్లకు, రూ. 40,000 వేలు చిన్నకారులకు రూ. 70,000 , టూ వీలర్స్ కి రూ. 8,000 వేలు,టీవీలపై రూ. 3,000.. ఏసీలపై రూ 2,800 ఆదా అవుతుందంటూ..  మీరు ఒక నెలలో ఎంత ఆదా చేసుకున్నారో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోండి అంటూ ఒక ప్రకటన చేసింది. ఓవరాల్ గా కూటమికి మంచి ప్రచారమే చేసింది ఏపీ ప్రభుత్వం.


కానీ ఇక్కడ లోటు ఏమిటంటే.. మోదీ, చంద్రబాబు ఫోటో పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడమే? జనసేన నేతలలో,  కార్యకర్తలలో లోటుగా కనిపిస్తోంది. కూటమిలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్ర పోషించారు..ముగ్గురు కలిసి ఉన్న ఫోటో ఉంటే బాగుండేదనే అభిప్రాయం జనసేన కార్యకర్తలలో కనిపిస్తోంది. కూటమి గెలుపుకు ప్రధానంగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఫోటో ప్రధానంగా లేకపోవడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ పైన నారా లోకేష్ తో పాటుగా పవన్ కళ్యాణ్ చిన్న ఫోటోని చూపించారు. మరి ఇక మీదటైనా మోదీ ,చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోలతో ప్రచారం చేస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: