రాజకీయాలు అంటే ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. కళ్ళు మూసి తెరిచేలోపు ఎన్నెన్నో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో బ్యాక్ టైమ్ నడుస్తోందనే విధంగా వినిపిస్తున్నాయి. అధికారం చేపట్టి ఏడాదిన్నర కావస్తోంది.గతంలో తాము చేసిన వైఫల్యాలను , గత వైసిపి పాలన చేసిన విధ్వంశాలను తెలియజేస్తూ తాము మారిపోయాము కూటమికి ఓటు వేయండి మంచి చేస్తామంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కూటమిలో భాగంగా నేతలు ఎన్నికల ముందు భారీ ఎత్తున ప్రచారం చేశారు.దీంతో ప్రజలు కూడా నమ్మి భారీ విజయంతో కూటమికి పట్టం కట్టారు.


కానీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, నేతలు చేస్తున్న పనుల వల్ల కూటమి సర్కార్ కు దెబ్బ పడేలా కనిపిస్తోంది. ఇటీవల వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, అలాగే నకిలీ మద్యం తయారీ విషయం, నేతల దౌర్జన్యాలు, ఇసుక దోపిడీ ,అలాగే యూరియా ,ఇలా ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయాల పైన ప్రజలే రగిలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. కూటమికి కావలసిన వాళ్లకు ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు అప్పగిస్తున్నారనే విషయాన్ని జనంలోకి వైసిపి పార్టీ చాలా బలంగా తీసుకువెళ్ళింది. గత వైసిపి పాలనలో వైద్య కళాశాలలకు 20 నుంచి 25 శాతం వరకు ఖర్చు చేసి భవనాలను నిర్మించగా, ఇప్పుడు వాటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఈ వైద్య కళాశాలలో పూర్తి చేయడానికి రూ .5000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. వీటిని పూర్తి చేయకుండా , ప్రవేటికరణం చేయడంతో ప్రజలు అసంతృప్తిని తెలుపుతున్నారు.


వైసిపి హయాంలో లిక్కర్ స్కామ్ అంటూ గత ఏడాది నుంచి పెద్ద తతంగా కూటమి ప్రభుత్వం నడుపుతోంది. ఇందులో చాలామంది వైసిపి నాయకులను అరెస్టు చేశారు. కొంత మంది రిటైర్డ్ అధికారులను కూడా అరెస్టు చేయడం జరిగింది. వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యాన్ని అందించలేదంటూ చాలానే విమర్శలు చేసిన కూటమినేతలు, కూటమి అధినేతలు. కానీ ఇప్పుడు కల్తీ మద్యం తయారీకి ఏకంగా కుటీర పరిశ్రమలే మొదలుపెట్టారు టిడిపి నేతలు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలలో విమర్శలకు మరింత బలాన్ని కలిగిస్తోంది . వీటన్నిటిని చూస్తూ ఉంటే గత వైసిపి పాలనే మేలనే అభిప్రాయం ఇప్పుడు ప్రజలలో రోజురోజుకీ ఎక్కువ అవుతోందట. దీంతో కూటమి సర్కార్ పైన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ చెప్పిన ఇప్పటివరకు వాటికి సంబంధించి ఎలాంటి విషయాలను ప్రకటించలేదు, దీంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన వాటిని పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో ఉద్యోగులు అసహనాన్ని తెలుపుతున్నారు. అలాగే మహిళలు కూడా అసంతృప్తితో కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: