ఆంధ్రప్రదేశ్లో కడప రాజకీయాలలో నిరంతరం ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆమె అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరేవరకు ఆ విషయం పైన ఎంతవరకైనా వెళ్తుందని ఎన్నోసార్లు నిరూపించింది. అలాంటి వాటివల్లే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా కూడా మారుతూ ఉంటుంది ఈ ఎమ్మెల్యే. అయినా కూడా కడప ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధమౌతోంది. అయితే ఇప్పుడు తాజాగా కడప నగరానికి ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న సమస్యను తీర్చే పనిలో పడింది కడప రెడ్డమ్మ మాధవి రెడ్డి.


తాజాగా కడప ఎమ్మెల్యే కడప పట్టణంలో ఉన్న నాగరాజు పేట నుంచి రవీంద్రనాథ్ నగర్ వరకు , గుర్రాల గడ్డ నుంచి షమీరియా మసీదు దాకా బుగ్గ వంక మీద రెండు బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి ఎన్నికల ముందు హామీ ఇవ్వగా , అయితే ఇప్పుడు ఆ హామీని తాను నిలబెట్టుకునే విధంగా అడుగులు వేస్తోంది ఎమ్మెల్యే మాధవి రెడ్డి. ఇప్పుడు వాటిని పూర్తి చేయడానికి పనులను ప్రారంభించి శంకుస్థాపన కూడా చేసినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రజలు ఈ విషయం విని ఆనందపడుతున్నారు .ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నందుకు టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా ఈ ఎమ్మెల్యేను ప్రశంసిస్తున్నారు.


గతంలో కూడా కడప జిల్లాలో తాగినీటి సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే మాధవి రెడ్డి శాసనసభలో బడ్జెట్ చర్చలు జరుగుతున్న సందర్భంగా అడిగారు. అలాగే ప్రజలు కల్తీ నీటి వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పెన్నా నదిలో మురుగనీరు  కలవడం వల్ల నీరు కలుషితమవుతున్నాయని కడప మంచినీటి కోసం చెక్ డ్యాములు నిర్మించాలి అంటూ కడప ప్రజల తరఫునుంచి తాను కోరుతున్నాననే విధంగా శాసనసభలో తెలియజేసింది. ఇలా కడప ప్రజల కోసం ఎన్నో విషయాల పైన పోరాడుతూనే ఉంది ఎమ్మెల్యే మాధవి రెడ్డి. ఇప్పుడు బ్రిడ్జిల నిర్మాణ పనుల మొదలుతూ మళ్లీ వార్తలలో నిలుస్తోంది కడప ఎమ్మెల్యే.

మరింత సమాచారం తెలుసుకోండి: