ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరోసారి పర్యావరణ హిత నిధుల రూపంలో మంచి వార్త వచ్చింది. నగర వనాల  అభివృద్ధి కోసం కేంద్ర పర్యావరణ, అరణ్య,వాతావరణ మార్పుల శాఖ రెండో విడత నిధులను విడుదల చేసింది.రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో హరిత వాతావరణాన్ని పెంపొందించేందుకు, పౌరులకు స్వచ్ఛమైన గాలి, విశ్రాంతి ప్రదేశాలు కల్పించేందుకు చేపట్టిన “నగర వనం ప్రాజెక్ట్” కు కేంద్రం నుంచి ఈ సాయం అందుతోంది. ఇప్పటికే తొలి విడత నిధులతో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో నగర వనాల రూపకల్పన ప్రారంభమైంది.
 

కాగా  మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపాలిటీలో నగరవనాల అభివృద్ధి కోసం ఏపీ కేంద్రం ఇప్పటికే 11 నగరవనాలను ఏర్పాటు చేసి 15.4 కోట్ల నిధులను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే . ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో కూడా గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రశంసలతో ముంచేశారు . అటవి శాఖ అధికారులతో కలిసి నగరవనా కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి మరో గుడ్ న్యూస్ వచ్చేలా చేశారు . కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో నగరవనాలకు మరొకసారి నిధులు అందినట్లు తెలుస్తుంది.

 

ఈసారి రెండో విడత నిధులు విడుదల కావడంతో కొత్తగా గుంటూరు, నెల్లూరు, రాజమహేంద్రవరం, అనంతపురం వంటి నగరాల్లో కూడా ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. కేంద్రం నుంచి విడుదలైన ఈ నిధులు పచ్చదనాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, స్థానిక ప్రజలకు ప్రకృతి సమీపంలో విశ్రాంతి ప్రదేశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఉపయోగించబడతాయి. రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తెలిపినట్లు, ప్రతి నగరంలో కనీసం 25–50 ఎకరాల భూమిపై వనాల అభివృద్ధి జరుగుతుంది. స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వామ్యం కానున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటకానికి కూడా ఈ నగర వనాలు తోడ్పడతాయని అధికార వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి.



ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నగరవన అభివృద్ధికి నిధులు రెండో విడత నిధులు విడుదల చేసింది.  ఏపీలోనే దాదాపు 11 ప్రాంతాలలో నగర వన అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు ఏపీ డిప్యూటీ సీఎం గతంలో ప్రకటించారు . కాగా ఇప్పుడు 12 ప్రాంతాలలో నగరవనాల కోసం ఒక్కొక్క ప్రాంతంలో నగరవనాలను ఏర్పాటు చేసుకోవడానికి కోటి రూపాయలు చొప్పున మొత్తం 12 చోట్లకి 12 కోట్లు మంజూరు చేసినట్లు తెలుస్తుంది .  ఈ నగరవనాలనును ఏర్పాటు చేయడానికి పక్క ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం  ముందుకెళ్తుంది.  పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోబట్టే ఈ విధంగా కేంద్రం త్వరగా నగరవనాల కోసం నిధులు మంజూరు చేసినట్లు ప్రజలు మాట్లాడుకుంటున్నారు.  ఏపీ రూపురేకులు మారడానికి పవన్ కళ్యాణ్ కారణం అంటూ పవన్ కళ్యాణ్ గట్టిగా ట్రై చేయబట్టి నిధులు మంజూరు అయినట్లు జనసేన నాయకులు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తూ ఏపీకి ఇలాంటి నాయకుడే కావాలి అంటూ పొగిడేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: