సినీ ఇండస్ట్రీలో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కానీ అదే రాజకీయాల్లో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే ట్యాగ్ మాత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరుకే సొంతం. ఎన్నో సంవత్సరాలుగా ఆయన పెళ్లి గురించి రూమర్స్ వస్తూనే ఉన్నా, ప్రతి సారి అవి గాలిలో కలిసిపోతూనే ఉన్నాయి. అయితే, ఈ సారి దీపావళి వేళ రాహుల్ గాంధీ పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీపావళి సందర్బంగా రాహుల్ గాంధీ ఢిల్లీ నగరంలోని ప్రసిద్ధ ఓల్డ్ ఢిల్లీ ప్రాంతంలోని ఒక ప్రముఖ మిఠాయిల దుకాణానికి వెళ్లారు. ఆ దుకాణం నుంచి స్వీట్స్ కొనుగోలు చేయడానికి స్వయంగా వెళ్లిన ఆయనను చూసి అభిమానులు, ప్రజలు ఉత్సాహంగా ఫోటోలు తీసుకున్నారు. ఆ సమయంలో జరిగిన చిన్న సంభాషణే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఆ దుకాణ యజమాని  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “రాహుల్ గాంధీ గారు మా షాప్‌కు చాలా సార్లు వచ్చారు. మా కుటుంబం, గాంధీ కుటుంబం మధ్య చాలా ఏళ్ల అనుబంధం ఉంది. ప్రతి పెద్ద పండుగ సమయంలో లేదా ప్రత్యేక సందర్భాల్లో గాంధీ కుటుంబానికి మేమే స్వీట్లు సరఫరా చేస్తుంటాము. ఈసారి ఆయన స్వయంగా రావడం మాకు గౌరవంగా అనిపించింది,” అని అన్నారు.

ఇంకా ఆయన ఆసక్తికరంగా చెప్పిన విషయమేమిటంటే – “రాహుల్ గాంధీ గారిని చూసి నేను సరదాగా చెప్పాను – ‘మీరు భారతదేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సర్..! త్వరలోనే మీ పెళ్లి వార్త వినాలని ఆశిస్తున్నాం. మీ వివాహానికి స్వీట్స్ ఆర్డర్ మాకు దక్కాలి’ అని  చెప్పారట. దాని ఆయన నవ్వుతూ వెళ్లిపోయారట. ఆయనతో మాట్లాడిన ఆ క్షణం నాకు మర్చిపోలేని అనుభవం,” అని ఆ స్వీట్ షాప్ ఓనర్ తెలిపారు. ఇంకా ఆయన చెప్పుతూ.. “రాహుల్ గాంధీ మా షాప్‌కి వచ్చినప్పుడు ఆయన తండ్రి, దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకున్నారు. ఆయనకు "ఇమారి" స్వీట్ అంటే చాలా ఇష్టం అని అన్నారు. ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ రాహుల్ గారు కూడా అదే స్వీట్‌ను ఎంచుకున్నారు. ఆయన చాలా సింపుల్‌గా, మానవత్వంతో నిండిన వ్యక్తిగా కనిపించారు” అని వివరించారు.

ఇప్పుడు ఈ సంభాషణ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రాహుల్ గాంధీ పెళ్లి ఎప్పుడు? ఎవరితో? అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. అయితే కాంగ్రెస్ వర్గాల సన్నిహితులు మాత్రం ఈ వార్తలకు ఎటువంటి అధికారిక ఆధారం లేదని స్పష్టం చేస్తున్నారు. “ఇది కేవలం ఆ షాప్ యజమాని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. రాహుల్ గాంధీ పెళ్లి గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేదు” అని వారు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ గాంధీ పెళ్లి వార్త ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. కొందరు నెటిజన్లు “ఇప్పుడు అయినా రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే దేశానికి మరో సంతోషకరమైన వేడుక అవుతుంది” అని కామెంట్స్ పెడుతుండగా, మరికొందరు “ఈ వార్త నిజమైపోతే మిఠాయిల దుకాణదారుడే పెద్ద స్కూప్ ఇచ్చాడు” అంటూ సరదాగా రాస్తున్నారు. మొత్తానికి, దీపావళి సందర్భంగా రాజకీయాల్లో రాహుల్ గాంధీ పెళ్లి అనే ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!



 

మరింత సమాచారం తెలుసుకోండి: