కర్నూలు బస్సు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఒకింత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  పోలీసుల దర్యాప్తులో ఈ ఘటనకు సంబంధించి  కీలక విషయాలు వెల్లడయ్యాయి.  కర్నూలు ఎస్పీ విక్రాంత్  పాటిల్ మాట్లాడుతూ  శుక్రవారం జరిగిన బస్సు  ప్రమాద ఘటన  దర్యాప్తులో భాగంగా  శివ శంకర్ తో పాటు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి అనే వ్యక్తిని  గుర్తించామని తెలిపారు.  అతనిని పలు కోణాలలో విచారించామని  కామెంట్లు చేశారు.

ఎర్రిస్వామి,  పల్సర్ బైక్ నడుపుతున్న శివశంకర్ రాత్రి 2 గంటల సమయంలో తుగ్గలికి బయలుదేరారని ఆయన తెలిపారు. 2 గంటల 24 నిమిషాల సమయంలో కియా షోరూమ్ పక్కన ఉన్న పెట్రోల్ బంక్ లో  300 రూపాయల పెట్రోల్ పోయించుకున్నారని చెప్పుకొచ్చారు.  చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడ్ అయ్యి పడిపోయారని చెప్పుకొచ్చారు.  బైక్ వెనుక ఉన్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని ఎస్పీ కామెంట్లు చేశారు.

రోడ్డు మధ్యలో పడి  ఉన్న శివశంకర్ ను ఎర్రిస్వామి పక్కకు తీశాడని బైక్ ను కూడా తీద్దామని అనుకునే లోపు బస్సు వచ్చి వేగంగా  బైక్ ను ఈడ్చుకెళ్లిందని ఎస్పీ తెలిపారు. బస్సు కింద మంటలు రావడంతో  ఎర్రిస్వామి భయపడి అక్కడినుంచి తన స్వగ్రామం తుగ్గలి వెళ్లిపోయాడని పోలీసులు చెప్పుకొచ్చారు.  ఈ ఘటన గురించి ఉలిందకొండ పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండటం గమనార్హం.  ఈ కేసులో తదుపరి విచారణను  కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: