మనలో చాలామంది వేర్వేరు అవసరాల రిత్యా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ బస్సుల్లో వస్తువులను మరిచిపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కండక్టర్ వద్ద చిల్లర మరిచిపోవడం లాంటి పొరపాట్లు కూడా జరుగుతాయి. ఇలా జరిగితే ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ ప్రస్తుతం లాస్ట్ ప్రాపర్టీ హ్యాండోవర్ అనే విధానాన్ని అమలు చేస్తోంది.
ఎవరైనా బ్యాగ్ లేదా ఇతర వస్తువులను మరిచిపోతే ఈ విధంగా తిరిగి పొందవచ్చు. సర్టిఫికెట్లు, ఆస్తి పత్రాలు, విలువైన వస్తువులు, పర్సు లాంటి వాటిని బస్ లో మరిచిపోయిన పక్షంలో ఈ విధానం ద్వారా సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో మరిచిపోయినవి పొందాలంటే 0866 2570005 టీజీఎస్ ఆర్టీసీ అయితే 040 6944 0000 నంబర్ కు కాల్ చేసి టికెట్ పై ఉన్న డ్రైవర్ కోడ్, కండక్టర్ కోడ్ ను చెప్పాల్సి ఉంటుంది.
కొంతమంది టికెట్ పై రాసిన చిల్లరను వేర్వేరు సందర్భాల్లో మరిచిపోతూ ఉంటారు. ఈ విధానం ద్వారా ఆ సమస్యకు సైతం చెక్ పెట్టవచ్చు. యూపీఐ విధానంలో డబ్బులను సులువుగా పొందవచ్చు. బస్సు మేనేజర్ కు కాల్ చేసి టికెట్ పై ఉన్న వివరాలు చెప్పడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
రూల్స్ ప్రకారం ప్రయాణికులు ఎవరైనా వస్తువులను మరిచిపోతే వాటిని డీపీ క్లర్క్ కు అందిస్తారు. పోగొట్టుకున్న వస్తువుల వివరాలను క్లియర్ గా చెప్పడం ద్వారా ఆ వస్తువులను తిరిగి పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రయాణికులు, సిబ్బంది ఇద్దరూ తలచుకుంటే మాత్రమే ఈ విధానం సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ విధానం విషయంలో నెటిజన్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ రూల్స్ పూర్తిస్థాయిలో అమలైతే బాగుంటుందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి