ఆ ఇద్దరు నేతలు బైబర్త్ టిడిపి పసుపు కండువా తప్ప మరే రంగు ఎరుగని ఆ ఇద్దరు గత ప్రభుత్వంలో టెంప్ట్ అయ్యారు. తరతరాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి వైసిపి లోకి వెళ్లారు. తమ లైఫ్ సూపర్ అనుకున్నారు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవరికి తెలుసు ? రైట్ అనుకొన్నది రాంగ్ అవుతుంది రాంగ్ అనుకున్నది రైట్ అవుతుంది. అలాగే ఆ ఇద్దరు నేతల రాజకీయాలు తలకిందులు అయ్యాయి. ఈ ఇద్దరిలో ఒకరు వైసీపీ ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి. మరొకరు మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి. ఇద్దరు ప్రస్తుతం వైసీపీలో ఉన్న వారి రాజకీయ జీవితం మొత్తం టిడిపిలో కొనసాగింది. గత ఎన్నికల సమయంలో టిడిపిలో ఉన్న బంధాన్ని తెంచుకొని వైసీపీలో కొత్త భవిష్యత్తు ఎతుకున్న ఆ ఇద్దరు పొలిటికల్ కెరీర్ కి ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడింది అని టాక్ వినిపిస్తోంది.


కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం చేయడంలో సతీష్ రెడ్డి కుటుంబం ఎప్పుడు ముందు ఉండేది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి సతీష్ రెడ్డితో పాటు రామసుబ్బారెడ్డి కుటుంబాలు రెండు తెలుగుదేశం పార్టీలో ఉంటూ వచ్చాయి. తరతరాలుగా తమ కుటుంబానికి రాజకీయ విరోధులు అయిన వయస్ కుటుంబంతో ఈ ఇద్దరు నేతలు సర్దుకుపోవటం కడప రాజకీయాలను ఆశ్చర్యానికి గురి చేసింది. వైసీపీలో చేరిన తర్వాత రామసుబ్బారెడ్డికి వర్గ విభేదాలు వెంటాడడంతో మళ్లీ టిడిపికి వచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఎన్నికలకు ముందు మళ్ళీ ఎమ్మెల్సీ రావడంతో ఆయన ఆగిపోయారు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండడంతో మళ్లీ చలో టిడిపి అంటూ రామసుబ్బారెడ్డి పై అనుచరులు ఒత్తిడి చేస్తున్నారట.


ఇక పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న సతీష్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సతీష్ రెడ్డి 2014 తర్వాత ఎమ్మెల్సీ అవడంతో పాటు మండల వైస్ చైర్మన్ హోదా కూడా తెలుగుదేశం ఇచ్చింది. అలాంటిది ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకొని సెల్ఫ్ గోల్ వేసుకున్నారు అన్న చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరికి ఎలక నేతలు టిడిపిలో ఉండి ఉంటే మంచి భవిష్యత్తు ఉండేదన్న చర్చలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అనుచరులు ఒత్తిడితో తిరిగి వీరు టిడిపిలోకి వచ్చే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: