తుఫాను వల్ల పంటలు కోల్పోయిన రైతులకు సైతం హెక్టార్ కు రూ.17వేల నుంచి రూ .25వేల రూపాయలకు పెంచినట్లుగా తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు . ఇక అరటి పంట సాగు చేసిన వారికి అదనంగా రూ .10 వేల రూపాయలు కలిపి ఇవ్వబోతున్నామని దెబ్బతిన్న కొబ్బరి చెట్లకు రూ .1500 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం పైన ఈ నెల 11 నాటికి 100% అంచనా సిద్ధమవుతుందని తెలిపారు మంత్రి.
సోమవారం రోజున ఒక టీం బాపట్ల, మరొక టీం కృష్ణ ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలలో పర్యటించబోతున్నామని, అలాగే మంగళవారం రోజున ప్రకాశం, కోనసీమ జిల్లాలలో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించి తుఫాను బాధితులతో నేరుగా మాట్లాడి ధైర్యాన్ని చెప్పి రైతులకు సంబంధించి నష్టపరిహారాన్ని విడుదల చేసే విధంగా కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సీఎం చంద్రబాబు గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు నష్టపోతున్నారని, వారికి హెక్టారుకు రూ .50వేల రూపాయల చొప్పున అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు నష్టపోయిన ఉల్లి రైతులకు సహాయం అందుతుందని భావిస్తున్నారు. రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పుడు అండగా నిలుస్తుందని ఎవరు భయపడాల్సిన పనిలేదంటూ తెలిపారు చంద్రబాబు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి