జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇక రిజల్ట్ ఎలా వస్తుంది అనేది రెండు తెలుగు రాష్ట్రాలు  ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.. ఇదే తరుణంలో  అక్కడ కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బిజెపి నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు.. ఈ విధంగా జూబ్లీహిల్స్ లో ఎవరికి వారే ఎన్నికలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ లో  రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్  హోరాహోరిగా తలపడుతుంది. అయితే మొత్తం నాలుగు లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో , కేవలం 50% మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. ఇందులో ముస్లిం ఓట్లు హిందువుల ఓట్లు ఉంటాయి. ఇందులో సెటిలర్స్ తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లే కీలకం కానున్నాయి..

 మరి వీరి ఓట్లు ఎవరికి పడనున్నాయి అనేది చూద్దాం.. జూబ్లీహిల్స్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అయితే మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. ఆయనకు ఎక్కువగా అక్కడ పరిచయాలు ఉన్నాయి. అలాగే లంకల దీపక్ రెడ్డి కూడా తెలుగుదేశం నుంచి తన ప్రస్తానాన్ని స్టార్ట్ చేసి బిజెపిలోకి వచ్చారు. బిజెపి తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది.

అలాగే నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ తెలుగుదేశం పార్టీ మనిషి.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాత తెలుగుదేశం పార్టీ నాయకులంతా పరిచయమన్నారు. ఈ విధంగా మూడు పార్టీల నుంచి అందరూ నాయకులు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీరి ఓట్లు ఎవరికి పడనున్నాయి.. వారు ఏ వైపు ఎక్కువగా మొగ్గు చూపితే ఆ వైపు విజయం వస్తుందనేది తథ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: