పవన్ కళ్యాణ్ తీరులో ప్రత్యేకత ఉంది. ఆయన మంత్రి అయినా, నటుడైనప్పటికీ ప్రజలతో మమేకం అయ్యే తీరే ఆయన్ను వేరుగా నిలబెడుతోంది. ఇటీవల “పల్లె పండుగ 2.0” కార్యక్రమాన్ని సాస్కి నిధులతో నిర్వహించడం, గ్రామీణాభివృద్ధికి కొత్త దిశ చూపించడం ద్వారా పంచాయతీ రాజ్ శాఖను చైతన్యవంతం చేస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, శుభ్రత, తాగునీటి సరఫరా వంటి అంశాలను స్వయంగా సమీక్షిస్తున్నారు. జల్ జీవన్ మిషన్, పీఎం స్వామిత్వ వంటి కేంద్ర పథకాల అమలును వ్యక్తిగతంగా పరిశీలించి, లబ్ధిదారులకు నేరుగా చేరేలా చర్యలు తీసుకుంటున్నారు.
అటవీ శాఖ విషయానికి వస్తే - ప్రకృతిని ప్రేమించే పవన్ కళ్యాణ్‌కు ఇది మరీ దగ్గరి విషయం. “అడవి తల్లి బాట” అనే పేరుతో ఆయన ప్రారంభించిన కార్యక్రమం అటవీ గ్రామాల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది. వన్యప్రాణి సంరక్షణ, ఎర్రచందనం క్రమబద్ధీకరణ, ఏనుగుల సంరక్షణ వంటి అంశాలపై స్వయంగా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. గతంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు — సిద్దా రాఘవరావు (టीडీపీ), బాలినేని శ్రీనివాస్ రెడ్డి (వైసీపీ) - ఈ శాఖను నిర్వహించినా, పవన్ చూపిస్తున్న ప్రొయాక్టివ్ యాక్టివిటీ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇంకో వైపు, గ్రామీణ పంచాయతీ ఉద్యోగ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి పవన్ సీరియస్‌గా కృషి చేస్తున్నారు. 50 సంవత్సరాలుగా ఉన్న పాత వ్యవస్థను క్రమబద్ధీకరించి, ఒక రుర్బాన్ పంచాయతీ మోడల్, మూడు అంచెలుగా విభజించిన పాలనా నిర్మాణం ద్వారా ప్రజలకు పాలన మరింత దగ్గరగా చేరేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పంచాయతీ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి, ఆర్థిక స్వావలంబన కల్పించాలనే దృష్టితో సంస్కరణలను అమలు చేస్తున్నారు. మొత్తానికి, పవన్ కళ్యాణ్ నాలుగు శాఖలను నిర్వహించడమే కాదు, వాటిలో నూతన దిశ, నూతన శక్తి నింపుతున్నారు. ఆయన శ్రద్ధ, క్రమశిక్షణ, ప్రజలపట్ల ఉన్న ఆత్మీయత మంత్రిత్వానికి వన్నె తెస్తున్నాయి. రాజకీయ నాయకుడిగానే కాదు, ప్రజా సేవకుడిగా కూడా పవన్ కళ్యాణ్ తన ముద్ర వేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి