గత రెండు దశాబ్దాలుగా ఆయన సీఎం పదవిలో కొనసాగుతున్నారు. ఎన్నోసార్లు కూటములు మార్చినా, చివరికి అధికారంలోనే నిలిచారు. కానీ ఈసారి ఓటమి రుచి చూస్తే, నితీష్ ఖాళీగా కూర్చోరని, కొత్త వ్యూహాలతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెడతారని అంచనా. ఇక విశ్లేషకులు నితీష్ కుమార్‌ను మాజీ ఏపీ సీఎం మర్రి చెన్నారెడ్డితో పోలుస్తున్నారు. చెన్నారెడ్డి ఖాళీగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో కుదుపు వచ్చేది - ఆయనకు పదవి ఇవ్వడం తప్ప కాంగ్రెస్ పెద్దలు మరేం చేయలేకపోయారు. నితీష్ కూడా అలాంటి వారే అంటున్నారు నిపుణులు. ఆయన ఖాళీగా ఉంటే బీహార్‌లోనే కాదు, ఎన్డీయేలో కూడా భూకంపం తప్పదని భావిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ బలం టీడీపీ (ఏపీ నుంచి 16 ఎంపీలు) మరియు జేడీయూ (బీహార్ నుంచి 12 ఎంపీలు) మీదే ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఓటమి తర్వాత ఇండియా కూటమి వైపు మొగ్గుతారా అన్న చర్చ ముమ్మరంగా సాగుతోంది.
ఇక ప్రస్తుతం అది ఊహాగానమే అయినా, రాజకీయాల్లో ఏది అయినా క్షణాల్లో మారిపోవచ్చు. ఇక మరో సన్నివేశం కూడా చర్చలో ఉంది - బీహార్‌లో ఓటమి తర్వాత నితీష్‌ను కేంద్రంలోకి తీసుకురావాలన్న ప్లాన్. ఆయనకు కీలక శాఖ ఇవ్వడం, లేదా ఉపప్రధానిగా చేసే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కానీ బీజేపీ పెద్దలు దానిని అంగీకరిస్తారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. ఏదేమైనా, బీహార్ ఫలితాలు ఏ వైపుకు మొగ్గుతాయో అన్నదే ఇప్పుడు జాతీయ రాజకీయాల ఫ్యూచర్‌ను డిసైడ్ చేయనుంది. నితీష్ గెలిస్తే ఎన్డీయే బలపడుతుంది. ఓడితే ఇండియా కూటమి హుషారెత్తుతుంది. కానీ ప్రధాని మోదీ నాయకత్వం ఉన్నంతవరకు కేంద్ర సర్కార్ కదిలే ప్రసక్తి లేదని కూడా విశ్లేషకుల అభిప్రాయం. సో... బీహార్ ఎన్నికల ఫలితాలు “బిగ్ సౌండ్” ఇవ్వబోతున్నాయి — వెయిట్ అండ్ సీ!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి