ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  చాలా దూకుడు మీద ఉన్నాడు.. రాష్ట్ర అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు కనుసన్నుల్లో పని చేస్తూ తను తీసుకున్న బాధ్యతలు అన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. కేవలం ప్రత్యర్థులను విమర్శించడమే కాకుండా సొంత పార్టీలో ఉండే నాయకులు తప్పు చేసినా హెచ్చరిస్తున్నాడు.. ఎమ్మెల్యే లైనా, ఇతర మంత్రులైనా సరే చీల్చి చెండాడేస్తున్నాడు పవన్ కళ్యాణ్.. తాజాగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి చర్చించాడు.. కొందరు ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు ప్రజల యొక్క వ్యక్తిగత ఆస్తుల్లో తలదూర్చి ఇబ్బందులు పెడుతున్నారని, ఇరు వర్గాలు రాజీకి వచ్చినా కానీ వీళ్లు  ఆ కేసును క్లియర్ చేయడం లేదని అన్నారు. 

ఇలా ప్రజల మధ్య చిచ్చులు పెడుతూ ప్రభుత్వ పేరును చెడగొట్టే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఊరుకునేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో మా వరకు కూడా వచ్చిందని వారి బుద్ధి మార్చుకోవాలని గట్టిగా చెప్పారు. కూటమిలోని ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా  కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే అస్సలు ఊరుకోవద్దని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రజల్లో భూములకు సంబంధించిన వ్యవహారాల గురించే ఎక్కువ ఆర్జీలు వస్తున్నాయని, వాటిని త్వరగా క్లియర్ చేయాలని,లేదంటే ప్రజల్లో పని చేయని ప్రభుత్వంగా మిగిలిపోతామని తెలియజేశారు.

 రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, ప్రతిరోజు తహశీల్దార్, ఆర్డీవో,ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరు ఒక దగ్గర కూర్చొని 400 సమస్యలు క్లియర్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఇన్చార్జి మంత్రులదేనని  అన్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాలన తీరుపై సమీక్ష చేసి ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఆరా తీసి, వాళ్ళు చేయాల్సిన పనిపై శ్రద్ద పెట్టాలని హెచ్చరించారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు రాకుండా మన పార్టీ వేరే పార్టీ ఎమ్మెల్యేలను చూడకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: