ప్రాథమికంగా నిపుణులు ఇచ్చిన అంచనా ప్రకారం, ఈ అంతరాయానికి ప్రధాన కారణం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సిగ్నల్స్ “స్పూఫింగ్” కావడమేనని భావిస్తున్నారు. అంటే, ఎవరో ఉద్దేశపూర్వకంగా ఉపగ్రహ సిగ్నల్స్‌ను తారుమారు చేయడం ద్వారా విమానాల స్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందన్నమాట. అయితే అధికారికంగా ఈ అంశంపై ఇంకా ధృవీకరణ రాలేదు. అయినప్పటికీ, తాజాగా ఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో ఈ జీపీఎస్ స్పూఫింగ్ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.
ఉగ్రవాద కుట్రల వెనుక టెక్నాలజీ ఆటలు
ఇటీవల కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన వ్యక్తులు వరుసగా అరెస్టవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఆపరేటివ్లు, లష్కరే తోయిబా ముఠా సభ్యులు, వారి అనుచరులు వివిధ రాష్ట్రాల్లో పట్టుబడుతున్నారు.
జమ్మూ కశ్మీర్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పోలీసులు ఇప్పటివరకు 300 కిలోల ఆర్డీఎక్స్, 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్, అలాగే ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది చూస్తే దేశవ్యాప్తంగా ఉగ్రవాదులు పెద్ద స్థాయిలో దాడులు ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ కుట్రలను భగ్నం చేసేందుకు భారత కౌంటర్ ఇంటెలిజెన్స్ సంస్థలు జీపీఎస్ స్పూఫింగ్ టెక్నాలజీని వాడిన అవకాశం ఉంది. దీంతో ఉగ్రవాదుల డ్రోన్లు లేదా వాహనాలు తమ లక్ష్య స్థానాలను గుర్తించడంలో తప్పులు జరిగి, పెద్ద దాడులు తప్పిపోయే అవకాశం ఉందని అంచనా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి