కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఎప్పుడైతే చేపట్టిందో అప్పటినుంచి ప్రతి రోజు ఏదో ఒక గొడవ సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వస్తూనే ఉంది. పాలనపై దృష్టి పెట్టకుండా  పదవులపై కాంక్షతో ప్రతిరోజు గొడవ పెట్టుకుంటూ ఢిల్లీకి పయనమవుతుంటారు నేతలు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సీటు కోసం డీకే శివకుమార్, సిద్ధా రామయ్య మధ్య  కాస్త గందరగోళం ఏర్పడింది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరి మధ్య ఒక ఒప్పందం చేసి  ఆ గొడవ సర్ధుమణిగేలా చేసింది. ముఖ్యంగా రెండున్నర సంవత్సరాల పాటు  సిద్ధారామయ్య సీఎంగా ఉంటారని, ఆ తర్వాత డీకే శివకుమార్ కి సీఎం పదవి అందుతుందని తెలియజేశారు. ఇద్దరికీ నచ్చజెప్పి పాలనను నడిపిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం కు మరో తలనొప్పి వచ్చి పడింది.

 తాజాగా రెండున్నర సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డీకే శివకుమార్ వర్గం ఎదురు తిరుగుతోంది. మా నాయకుడికి సీఎం సీటు ఇవ్వాలని అధిష్టానంను అడిగింది. అంతేకాదు దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు,మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి వచ్చారు.. మరి అక్కడ ఏం జరిగింది అనే వివరాలు చూద్దాం.. బీహార్ ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలై ఓటమికి కారణాలేంటో తెలుసుకునే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అలాంటి ఈ సమయంలో కర్ణాటక రాష్ట్రం నుండి చిక్కులు రావడం కాంగ్రెస్ కు మరింత తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ సందర్భంలోనే ఒకవేళ ముఖ్యమంత్రిని మారిస్తే మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

 దీంతో అధిష్టానం కూడా ఐదేళ్లపాటు సిద్ధారామయ్యనే సీఎం గా ఉంటారని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఆ పట్టుతోనే సిద్ధధా రామయ్య కూడా చాలా సభల్లో మీడియా ముఖంగా కూడా నేనే సీఎం గా ఉంటానని చెప్పుకొస్తున్నారు. మరి డీకే శివకుమార్ వర్గం దీనికి ఒప్పుకుంటుందా.. ఏదైనా అలజడి సృష్టిస్తుందా.. అనేది మరికొన్ని రోజుల్లో బయటకు రానుంది.. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఇలా నాయకులు ఏ విషయాన్ని అయినా బహిరంగంగా బయటపెడుతూ వస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో పార్టీ పలుచబడుతుందని అధిష్టానం అర్థం చేసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: