రాజకీయాల్లో ప్రతి పక్షంలో ఉన్నవారు కచ్చితంగా ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఉంటారు. ప్రస్తుతం అదే చేస్తుంది తెలంగాణ లో ప్రధాన ప్రతి పక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. అయితే తాజాగా ఈ కార్ రేసింగ్ వ్యవహారం లో కేటీఆర్ జైలుకు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఇక ఈ కార్ రేసింగ్ లో నేను ఎలాంటి తప్పు చేయలేదు.లై డిటెక్టర్ పెట్టినా కూడా ఓకే.. తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి. నన్ను అరెస్టు చేసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి కి లేదు. అలాగే హైదరాబాదు లో అతిపెద్ద భారీ భూ కుంభకోణం జరుగుతుంది. 

9,300 ఎకరాల కుంభకోణాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. క్యాబినెట్ మీటింగ్లో సైలెంట్ గా ఈ కుంభ కోణం గురించి మాట్లాడుకున్నారు. రేవంత్ కేబినెట్ భేటి లో 5 లక్షల కోట్ల ఆస్తులను కొట్టేసేందుకు తెరలేపారు.. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీ లో తన అనుచరులకి ఈ భూమిని ఇచ్చేందుకు సైలెంట్ గా రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. ఈ భూ కుంభ కోణం పై మేము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. వదిలిపెట్టేదే లేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.

అంతే కాదు రేవంత్ రెడ్డి ని నమ్మి ఆయన కుంభకోణాల్లో పాలుపంచుకుంటే ఖచ్చితంగా నట్టేట మునుగుతారని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు మీద దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెర లేపాడు అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. మరి కేటీఆర్ చేసిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: