కర్ణాటక ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచింది.. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే సీఎంను ఎన్నుకునే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేసిందట.. అయితే మొత్తం ఐదు సంవత్సరాలలో సగభాగం సిద్ధరామయ్య మరో సగభాగం డీకే శివకుమార్ సిఎం గా ఉండాలని అప్పుడు ప్రతిపాదించిందట. దీంతో సిద్ధరామయ్యకు ముందుగా సీఎం పదవిని అందించిన కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం గా డీకే శివకుమార్ ను ఎన్నుకుంది. అయితే సిద్ధరామయ్య పదవి కాలం  ప్రస్తుతం ముగియడంతో డీకే శివకుమార్ నాకు సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఇదే సందర్భంలో సిద్ధరామయ్య కూడా ఐదు సంవత్సరాలు నేనే సీఎం అంటూ చెప్పుకొస్తున్నారు. సహించలేనటువంటి డీకే శివకుమార్ ఏదో ఒకటి తెలుసుకోవాలని సిద్ధపడిపోయారు.. 

కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్లి ఎలాగైనా సిద్ధరామయ్యతో రాజీనామా చేయించాలని శివకుమార్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇక డీకే శివకుమార్ అధిష్టానం వద్దకు వెళ్లి నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తట్టుకుని నిలబడ్డారని అధిష్టానం ముందు విన్నవించారు. తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా నాకు ఛాన్స్ ఇవ్వాలని  కాంగ్రెస్ అధిష్టాన నాయకులను కోరినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో డికే శివకుమార్ వర్గము ఒకవైపు సిద్ధరామయ్య వర్గం మరోవైపు ఎవరికి వారే మంతనాలు చేస్తూ ప్రజా పాలన గాలికి వదిలేసినట్లు తెలుస్తోంది.

ఈ ఇష్యూపై  ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినా కానీ అస్సలు మాట పట్టించుకోవడం లేదు. అయితే అధిష్టాన నాయకులు 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిగా నిన్ను ప్రకటిస్తామని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు అదే పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా శివకుమార్ ని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. అయినా శివకుమార్ అప్పటివరకు పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు తప్పనిసరిగా సీఎం పదవి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. మరి అధిష్టానం ఇతర మంత్రులు ఎమ్మెల్యేల బుజ్జగింపులకు శివకుమార్ తలొగ్గుతారా లేదా అనేది త్వరలో బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: