అద్దంకి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ నుంచి వరుస విజయాలతో దూసు కుపోతున్నారు మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవి. బుజ్జిగా సుపరిచితులు అయిన ఆయన.. ఇక్కడి ప్రజలకు పిలిస్తే పలికే నేతగా గుర్తింపు పొందారు. ఇక, నియోజకవర్గం విషయానికి వస్తే.. గతానికి ఇప్పటికి సమూల మార్పులు కనిపిస్తున్నాయి. నిజానికి గొట్టిపాటి విజయం దక్కించుకున్న పలు సందర్భాల్లో ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీ ప్రతిపక్షంలో ఉంది.
2014లో గొట్టిపాటి వైసీపీ తరఫున విజయం దక్కించుకున్నప్పటికీ.. ఆ పార్టీ అప్పట్లో విపక్షంలో ఉంది. దీంతో నియోజకవర్గంలో ఏం చేయాలన్నా ఇబ్బందులు వచ్చాయి. ఇక, 2019కి ముందు.. పార్టీ మారి.. టీడీపీలోకి వచ్చారు. అయినా.. రవిని ఇక్కడి వారు గెలిపించారు. అయితే.. చిత్రంగా టీడీపీ కూడా 2019 తర్వాత విపక్షంలో కూర్చుంది. ఫలితంగా ఆ ఐదేళ్లు కూడా నియోజకవర్గంలో ఆశించిన మేరకు ఏమీ చేయలేకపోయారన్నది ఆయనే కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
కానీ. గత ఏడాది టీడీపీ విజయం దక్కించుకోవడం.. పైగా మంత్రిగా గొట్టిపాటికి చంద్రబాబు మంచి ఛాన్స్ ఇవ్వడంతో ప్రభుత్వం పరంగా.. నియోజకవర్గానికి మేలు చేసే అవకాశం ఆయనకు లభించింది. దీంతో ఇప్పుడు ప్రధాన రహదారుల నుంచి విద్యుత స్తంభాలు.. లైన్లు, కొత్త కనెక్షన్లు.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాలు వంటివి వడివడిగా సాగుతున్నాయి. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపడుతున్నా.. అద్దంకిలో మాత్రం కొంత ప్రత్యేకంగా ఈ పనులు చేపట్టడం గమనార్హం.
దీంతో మంత్రి పేరు ఇప్పుడు మరింత పుంజుకుంది. ఇక, తనకు సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే వారికి నిరంతరం గొట్టిపాటి అందుబాటులోనే ఉంటున్నారు. తన ఇంటి నుంచి ఆఫీసు వరకు.. ప్రజలు ఎప్పుడు వచ్చినా ఆయన పలకరిస్తున్నారు. ఇక, అద్దంకి నియోజకవర్గాన్ని నెంబర్ 1 చేసేందుకు ప్రత్యేకంగా బ్లూ ప్రింట్‌ను కూడా రెడీ చేసుకున్నారు. వచ్చే మూడేళ్లలోనే నియోజకవర్గాన్ని నెంబర్ చేసేందుకు.. గొట్టిపాటి ప్రయత్నిస్తున్నారు. సో.. ఎలా చూసుకున్నా, గతానికి ప్రస్తుతానికి భారీ తేడా ఉందని అంటున్నారు పరిశీలకులు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి