కొంతమంది నిజంగా అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తున్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజల సమస్యలపై స్పందిస్తూ, నియోజకవర్గాన్ని పట్టు లో పెట్టుకుంటున్నారు. కానీ వీరి సంఖ్య మొత్తం బృందంతో పోలిస్తే చాలా తక్కువ. మొత్తం 60కి పైగా కొత్త ఎమ్మెల్యేల్లో 20 % మంది మాత్రమే ప్రజలకు చేరువగా ఉంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. మిగిలిన వారంతా వారి సొంత పనులు చక్క పెట్టకోవడంలోనూ .. వ్యాపారాల్లోనూ.. సంపాదనల్లోనూ మునిగి తేలుతున్నారట. అసలు పార్టీ ఎజెండా, పార్టీ కార్యక్రమాల గురించి పట్టించుకున్న వారే లేరంటున్నారు. మరి కొందరు కొత్త ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో కనిపించనే కనిపించడం లేదని నివేదికలు తెలిపుతున్నాయి. ఎన్నికలు ముగిశాక ప్రజల్లోకి తిరిగి వెళ్లడం చాలా వరకు తగ్గించేశారట.
ఇక మరి కొందరు ఎమ్మెల్యేలు అయితే ఏకంగా వైసీపీ నేతలతో కలసి తిరుగుతున్నారనేది వచ్చిన ఫిర్యాదుల్లో ప్రధాన అంశం. ఇది పార్టీకి మంచిది కాదని భావించిన చంద్రబాబు దీనిపై మరింత సీరియస్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి కారణంగా పార్టీ అంచనాలను నిలబెట్టుకోని కొత్త నేతల సంఖ్య ఎక్కువ కావడంతో “ అధికారంలో ఉన్నప్పుడే ప్రజలతో కనెక్ట్ కాకపోతే , తిరిగి ఎన్నికల సమయంలో ఎలా నమ్మేలా చేస్తాం ? ” అన్న ఆందోళన టీడీపీ శ్రేణుల్లో పెరిగింది. అందుకే చంద్రబాబు ప్రత్యక్షంగా రివ్యూలు మొదలు పెట్టడమే కాక, త్వరలో పనితీరు బట్టి రేటింగ్, వార్నింగ్, చివరికి రీస్ట్రక్చరింగ్ కూడా ఉండొచ్చు అన్న చర్చ బలపడుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి