తెలుగుదేశం పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు ప్రజల అభీష్టం మేరకు పని చేస్తున్నారా ? లేదా ప్రతి విషయంలోనూ తమ సొంత ఎజెండా ను ముందుకు తీసుకు వెళుతున్నారా ? అన్న చర్చలు తెరమీదకు వస్తున్నాయి. పెనుమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీరుపై ఇప్పుడు వరుస ఫిర్యాదులు వస్తుండడంతో హై కమాండ్ సైతం బోడే తీరుపై ఆగ్రహం , అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా జిల్లాల మార్పులు .. చేర్పుల విషయంలో ఆయన తీరు మరోసారి చర్చ నీయాంశం అవుతోంది. పెనుమలూరు నియోజకవర్గం ప్రస్తుతం కృష్ణాజిల్లాలో ఉంది. ఈ జిల్లా కేంద్రం మచిలీపట్నం. ఈ నియోజకవర్గ పార్లమెంటు పరంగా కూడా మచిలీపట్నం లోనే ఉంది. అయితే భౌగోళికంగా పెనుమలూరు నియోజకవర్గం విజయవాడలో కలిసిపోయింది. సిటీలో కలిసిపోయిన నియోజకవర్గానికి విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోనే కలపాలని ఆ నియోజకవర్గ ప్రజలు బలంగా కోరుతున్నారు.
దీనిపై స్థానిక ప్రజలు .. ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిపై ప్రజాభిప్రాయం సేకరించి తన నివేదికలో పొందు పరిచింది. అయితే ఎమ్మెల్యే బోడే మాత్రం తమ నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే ఉంచాలని పట్టుబట్టారు. దాంతో ఆ ప్రతిపాదనను మంత్రి వర్గ ఉపసంఘం చేయకపోవడం .. ఈ విషయం చంద్రబాబుకు తెలిసి ఆయన తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. పెనమలూరు ప్రజల డిమాండ్ ఏమిటి ? అని చంద్రబాబు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వద్దన్నారని కమిటీ చెప్పింది. దాంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సౌకర్యం చూడాలా.. ఎమ్మెల్యే సౌకర్యమా అని ఘాటుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
వాస్తవానికి గత ఎన్నికల్లో పెనమలూరు సీటును చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కు ఇచ్చారు. అప్పుడు బోడే ప్రసాద్ తో పాటు ఆయన కుటుంబం అంతా రోడ్ల మీదకు వచ్చి... దీక్షలు చేసి మరీ సీటు దక్కించుకుంది. చివరకు బోడే వైసీపీ నుంచి అప్పుడు మంత్రి గా ఉన్న జోగి రమేష్ మీద విజయం సాధించారు. కానీ ఇప్పుడు తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం కాకుండా .. తన సొంత ఎజెండా తో రాజకీయాలు చేయడంతో హైకమాండ్ వద్ద మైనస్ మార్కులు పడుతున్నాయంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి