ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో త్వరలోనే టిడిపి పార్టీ ఆధిపత్యం రాబోతోంది. వైసిపి పార్టీ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా వారి రాజీనామాలను ఆమోదించాలని మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుతో సమావేశమయ్యారు. తమ ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలను త్వరగా ఆమోదించాలంటూ కోరడం జరిగింది. బల్లి కళ్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకటరమణ, కర్రీ పద్మశ్రీ, జాకియా ఖానం, పోతుల సునీత శాసనమండలి చైర్మన్ ని కలిశారు. ఈ 6 మంది మాజీ వైసీపీ ఎమ్మెల్సీలు  చైర్మన్ రాజు తో వ్యక్తిగతంగా హాజరై ఒక్కొక్కరుగా చైర్మన్ తో  తమ వాదనలను వినిపించారు.. దీంతో త్వరలోనే రాజీనామా లేఖలపై సరైన నిర్ణయం తీసుకుంటామంటూ తెలిపారు చైర్మన్ రాజు.


2024 ఎన్నికలలో వైసిపి పార్టీ పరాజయం తర్వాత ఆ పార్టీలో ఉండే నేతలు అసంతృప్తితో ఇతర పార్టీలలోకి చేరారు. అలా ఈ 6 మంది ఎమ్మెల్సీలు 2024- 2025  మధ్యకాలంలోనే తమ రాజీనామాలను అందించారు. పార్టీలో ఉండే అసంతృప్తి కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల వీరు జనసేన, టిడిపి, బిజెపి పార్టీలో చేరారు. అయితే ఇప్పటివరకు చైర్మన్ రాజు  ఈ రాజీనామాలను ఆమోదించలేదని , తమ రాజీనామాలను ఆమోదించాలంటూ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా గత నెల 26వ తేదీన చైర్మన్ రాజు పైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి నాలుగు వారాల లోపల విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలను జారీ చేసింది.



ఈ ఆదేశాలతో నిన్నటి రోజున విజయవాడలోని మండలి కార్యాలయంలో చైర్మన్ కలిశారు. వారు వ్యక్తిగతంగా హాజరై రాజీనామాలను ఆమోదించాలని చైర్మన్ రాజుని కోరారు. అయితే కోర్టు ఇచ్చిన నాలుగు వారాలలోపు విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకుంటామంటూ తెలియజేశారు చైర్మన్ రాజు. వీరి రాజీనామాలను ఆమోదిస్తే ఖచ్చితంగా 6 స్థానాలు ఖాళీ అవుతాయి కాబట్టి వాటి ఉపఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైసిపి పార్టీ గెలవదు. ఎందుకంటే సభలో బలం లేనందువలన అన్ని సీట్లను కూడా  కూటమి పార్టీని గెలిచే అవకాశం ఉంది. అందుకే వైసీపీకి చెందిన శాసనమండలి చైర్మన్ రాజు వీరి రాజీనామా అనే ఆమోదించడానికి ఆలస్యం చేస్తున్నారనే విధంగా టిడిపి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం శాసనమండలిలో వైసిపి పార్టీకి ఎక్కువ మెజారిటీ ఉంది. ఒకవేళ ఇప్పుడు వీరి ఆరుగురి రాజీనామాలను ఆమోదిస్తే ఆ ఖాళీలు మళ్లీ కూటమి ఖాతాలోకి చేరుతాయి.. ఒకవేళ ఈ ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదిస్తే మరి కొంతమంది చేస్తారని దీంతో మండలిలో వైసీపీ మెజారిటీ కూడా కోల్పోయే అవకాశం ఉందని వినిపిస్తోంది. మరి వీరి రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: