ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం పైన సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా మొదటిసారి ప్రైవేట్ యాజమాన్యాలు తమ కాలేజీలను నడపలేమంటూ రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం గత ఏడాదిన్నరకు పైగా ఫీజు రిమెంబర్స్ మెంట్ ను విడుదల చేయకుండా లక్షలాదిమంది విద్యార్థులు భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని ప్రతిపక్ష నేతలు మాట్లాడేలా చేస్తోంది. 2024 ఎన్నికలలో అన్ని కాలేజీల ఖాతాలలో ఫీజు రిమెంబర్స్ అందిస్తామని, ఎన్నికల ముందు నమ్మబలికి గెలిచిన తర్వాత చేతులెత్తేసినట్టుగా కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం.


ఇప్పటివరకు ఎనిమిది క్వార్టర్ల ఫీజు రూ. 5,600 కోట్లు , హాస్టల్ మెయింటెన్స్ కింద విద్యార్థులకు ఇవ్వవలసిన రూ. 2,200 కోట్ల రూపాయలతో కలుపుకొని మొత్తం మీద 7,800 కోట్ల రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి  18 నెలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అయితే అంతకుముందు పెండింగ్ ఉన్న రూ.750 కోట్ల రూపాయలను మాత్రం ప్రభుత్వం వచ్చాక విడుదల చేసింది. ఇప్పటి ప్రభుత్వ బకాయిలను అసలు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు.నిన్నటి రోజున ఈ విషయం పైన జగన్ కూడా ఫైర్ అయ్యారు.. చంద్రబాబు హయాంలో రూ. 1750 కోట్ల రూపాయలు బకాయిలు ఉంచగా వాటిని తీర్చామని తెలియజేశారు. కానీ ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఫీజు రిమెంబర్స్ మెంట్ ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారని ఫైర్ అయ్యారు.


దీంతో కళాశాలలు ఏపీ ప్రభుత్వం పై నమ్మకం కోల్పోవడంతో విద్యార్థులు డబ్బులు ఉంటేనే కళాశాలలకు వచ్చి జాయిన్ అవ్వండి.. ఒకవేళ ఫీజు రిమెంబర్స్ మెంట్ వస్తే ఇస్తామంటూ చెబుతున్నారట. అలాగే ఆరోగ్యశ్రీ వంటి పథకం పైన కూడా మీ దగ్గర డబ్బులు ఉంటే చేయించుకోండి ప్రభుత్వం డబ్బులు వేస్తే మీకు ఇస్తామని హాస్పిటల్ యాజమాన్యులు తెలియజేస్తున్నారు. అటు విద్యార్థులకు ఇటు ప్రజలకు తీవ్రమైన ఇబ్బందిగా మారింది. పేదల ప్రాణాలను కాపాడింది, పేదలను విద్యావంతులుగా మార్చింది ఈ రెండు పథకాలే. అయితే ఈ రెండు పథకాలను వదిలేస్తే భవిష్యత్తులో చాలా ప్రమాదకరం అవుతుంది.. మొదటిది యువతరం నాశనం అవుతారు, మరొకటి ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి.. ముఖ్యమైనది ఏమిటంటే ప్రజలలో తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఈ విషయాల పైన ఏపీ ప్రభుత్వం మరొకసారి ఆలోచించాల్సిన పరిస్థితి మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: