తనపై వస్తున్న ఊహాగానాలపై డైరెక్ట్ గా స్పందించలేదు కానీ ఎప్పటిలాగానే టిడిపి,కూటమి ప్రభుత్వం పైన ఫైర్ అయ్యింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తే మాజీ మంత్రి విడుదల రజిని పార్టీ వీడే అవకాశాలు లేవని కనిపిస్తున్నాయి. 2019 లో చిలకలూరిపేట నియోజకవర్గంలో గెలిచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఈమె పైన పలు రకాల అవినీతి ఆరోపణలు కూడా వినిపించాయి. వైసిపి పార్టీ అధికారం కోల్పోగానే ఎన్నో కేసులు నమోదైనప్పటికీ వాటన్నిటి పైన కూడా కోర్టు ఉరట కలిగించింది.
2024 ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయగా అక్కడ ఓటమిని చవి చూసింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ చిలకలూరిపేట నియోజకవర్గానికి పార్టీ బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. కొద్ది రోజులపాటు బాధ్యతలు చేపడుతున్న సమయంలో..విడుదల రజిని హఠాత్తుగా రేపల్లెకు వెళ్లాలంటూ పార్టీ పెద్దలు చెప్పడంతో ఆమె మనస్థాపన చెందిందని దీనివల్ల పార్టీ మారబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి.. ఇలాంటి తరుణంలోనే రజిని పల్నాడు నేతలతో కలిసి ప్రెస్మీట్ పెట్టి వచ్చే ఎన్నికలలో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చి అందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ వ్యాఖ్యలు చేసింది. దీన్నిబట్టి చూస్తే విడుదల రజిని పార్టీ మార్పుపై ఇలా కౌంటర్ వేసినట్టుగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి