అయితే ఇప్పుడు తాజాగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి, ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. గతంలో ఏడాదికి రూ .8 కోట్ల ఆదాయాన్ని ఇచ్చి పున్నమి రిసార్ట్స్ తొలగించి ఈ భవనాన్ని నిర్మించడం వల్ల రూ .20 లక్షల రూపాయల వరకు వృధా ఖర్చు నెలనెలా వస్తోందని ప్రభుత్వం తెలుపుతోంది. దీంతో ఈ భవనాన్ని కొన్ని ప్రైవేటు సంస్థలకు లీజు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రివర్గ ఉప సంఘం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వానికి భారంగా ఉన్న ఈ రుషికొండ భవనాలను , టాటా, హెచ్ఈఐ, HCLC, ఆట్మాస్పియర్ కోర్ వంటి హాస్పిటల్స్ కూడా ముందుకు వచ్చాయని ఒక నివేదికను పర్యాటక శాఖ అధికారులు ప్రభుత్వానికి అందించారు. దీంతో రుషికొండ ప్యాలెస్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించేలా ప్రభుత్వానికి అవకాశం లభించిందని చెబుతున్నారు. అంతేకాకుండా పలు రకాల అంతర్జాతీయ సంస్థలు కూడా రుషికొండ భవనాలను లీజు తీసుకోవడం విషయంపై కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుతో చర్చించబోతున్నారు. గత ప్రభుత్వంలో విమర్శలకు దారి తీసిన రుషికొండ భవనాలను ఏం చేస్తారనే విషయంపై ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఏం చేస్తారనే విషయంపై ఈనెల ఆఖరిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి