రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, కడప ఎంపి వైఎస్ జగన్ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెగ్గిందా, ఓడిందా అన్న చర్చ జరుగుతోంది. అయితే జేసీ ఆచర్చ అనవసరమని, పార్టీని దిక్కరించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలని జేసీ సలహా ఇచ్చారు.  హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన జేసీ.. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై వీలైనంత త్వరగా వేటు వేసి... ఆతర్వాత ఉప ఎన్నికలకు వెళ్లాలంటున్నారు. ఒకటి రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా వచ్చే నష్టమేమీ లేదని... జగన్ ప్రభావం రోజురోజుకీ తగ్గుతోందని జేసీ దివాకర్‌రెడ్డి అంటున్నారు. అయితే దివాకర్ రెడ్డి ఏ ఆధారంతో చెప్తున్నారో అర్థం కావడం లేదని సొంతపార్టీ నేతలే అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబమే జగన్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోందని, అందుకే ఉప ఎన్నికల్లో కొన్ని సీట్లలో ఓడినా ఫర్వాలేదని అంటున్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నేతల అనుమానం భవిష్యత్తులో నిజమైనా ఆశ్చర్యం లేదేమో?   

మరింత సమాచారం తెలుసుకోండి: