హైదరాబాద్: చాలా రోజుల తరువాత కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని చాలా మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వస్తామంటున్నారనీ అన్నారు. అయితే, పార్టీలోకి వస్తామని అంటున్న అందర్నీ తమ పార్టీలోకి తీసుకోబోమంటున్నారు. ప్రజల్లో మంచి పేరున్న వారినే పార్టీలోకి ఆహ్వానిస్తామనీ, వారికే పార్టీలో స్థానం ఉంటుందన్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే హరీశ్వరరెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన కేసీఆర్...నవంబర్ 15న చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో టీఆర్ఎస్ లో చేరుతారనీ చెప్పారు. తెలంగాణలో సమైక్యవాద పార్టీలకు స్థానం లేదన్నారు. తెలంగాణపై మలి విడత చర్చలు జరిపేందుకు ఢిల్లీ నుంచి ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం లేదనీ, పిలిస్తే తప్పకుండా వెళ్తానన్నారు. అయితే, తెలంగాణ మంచిమాటకు కేంద్రం ఇస్తే ధన్యవాదాలు తెలుపుతాం. లేదంటే కత్తులు నూరుతాం. తెలంగాణ ఉద్యమ భవిష్యత్ కు సంబంధించి నవంబర్ మొదటి వారంలో కరీంనగర్ లో జరిగే పార్టీ సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నరు కేసీఆర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: