ఎప్పటిలానే ఈ రోజు కూడా ఇండియా హెరాల్డ్ ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకువచ్చింది.. అది ఏమిటంటే.. మాట చాలా విలువైనది.. పదునైనది కూడా.. అందుకే జాగ్రత్త పడాలి.. దీని వివరణ ఏమిటంటే..మనం మాట్లాడే ప్రతి మాట అర్థవంతమైనదిగా ఉండాలి. అంతేకాకుండా మనం మాట్లాడే ప్రతి మాట ఇతరులను ఆనంద పెట్టాలే కానీ విమర్శించకూడదు.. ఒక సారి మాట్లాడిన మాటలను తిరిగి  వెనక్కి తీసుకోలేము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి . అందుకే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అని దీని వివరణ..


ఉదాహరణకు ఎవరైనా తప్పు చేసి, కష్టాల్లో ఉన్నప్పుడు వారికి వీలైతే చేతనైన సహాయం చేయాలి.. కానీ మనకు నోరు ఉంది కదా..!  మాటలు వచ్చు కదా..! అని వారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించకూడదు .. మన మాటలు ఎదుటివారికి ఊరటనివ్వాలే కానీ బాధ పెట్టకూడదు . మనం ఎదుటి వారి తో మాట్లాడే ప్రతి మాట, వినే వాళ్లకు వినసొంపుగా ఉండాలే తప్ప కోపం తెచ్చుకునేలా ఉండకూడదు.


అంతే కాదు ఎవరికైనా ఒక్కసారి మాట ఇచ్చేటప్పుడు కూడా మనం ఆ మాట నెరవేర్చగలమా లేదా అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చే మాట అంత విలువైనది. ఒక్కొక్కసారి అవతలి వ్యక్తి ప్రాణాలను కూడా నిలబెట్టగల శక్తి ఈ మాటలకు ఉంది. కాబట్టి మనం వాడే కలం కన్నా,  మనం విసిరే మాటలు చాలా గొప్పవి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.


అంతే కాకుండా మాట చాలా పదునైనది. అలాగే విలువైనది కూడా..  మాట ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడే ఉపయోగించాలి. అవసరం లేని చోట దాన్ని వాడి, మన విలువను పోగొట్టుకోకూడదు. మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి. మౌనంగా ఉండాల్సిన దగ్గర మౌనంగానే ఉంది.. అంతేకానీ అవసరం లేని చోట మాటలు మాట్లాడి మన విలువను పోగొట్టుకోకూడదు..


చూశారు కదా ఫ్రెండ్స్.. మీరు కూడా ఎక్కడ, ఎప్పుడు,ఎలా మాట్లాడాలో తెలుసుకొని అలా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడే సమాజంలో నలుగురిలో మన విలువ గొప్ప స్థాయిలో ఉంటుంది..,

మరింత సమాచారం తెలుసుకోండి: