ప్రస్తుత కాలంలో మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..సలహా అనేది కేవలం సంతోష పెట్టేది మాత్రమే కాకుండా, సహాయపడే విధంగా ఉండాలి..!
దీని వివరణ ఏమంటే..మనం ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, వారికి కేవలం ఊరట మాత్రమే కలిపిస్తే సరిపోదు, వారికి సహాయపడే విధంగా ఉండాలి. అప్పుడే వారు తమ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఒకవేళ అదే సహాయం నీవు చేయలేక పోతే, వారికి మాట కూడా ఇవ్వకూడదు. ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారు. కానీ ఆ సలహాల వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదు. కాబట్టి ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు, మనము వారికి సహాయపడతామా..లేదా..అని ఆలోచించి, ఆ తర్వాతనే సలహా ఇవ్వడం మంచిది.. అని దీని అర్థం..
కాబట్టి ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు, ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని, మరీ సలహా ఇవ్వడం ఉత్తమం. అంతేకాకుండా సలహా ఇచ్చేటప్పుడు ఆ సలహాను మీరు పూర్తిచేయగలుగుతారా..లేదా.. అని కూడా ఒకసారి ఆలోచించాలి. అప్పుడే సలహా ఇవ్వగలిగే శక్తి మనకు వస్తుంది. మనం ఇచ్చే సలహా వల్ల ఇతరుల ప్రాణం నిలబడాలి. కానీ ఇబ్బంది పడకూడదు. కాబట్టి సలహా ఇస్తే సరిపోదు, సలహా తగ్గట్టుగా సహాయం కూడా చేయాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి